38.2 C
Hyderabad
April 29, 2024 12: 07 PM
Slider గుంటూరు

వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాను తరిమికొట్టగలం

#gopireddy

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని 6,7వార్డులో గల గిరి స్కూల్ ,వైయస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లో కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో శోభా రాణి, మున్సిపల్ కమిషనర రవీంద్ర తో కలిసి ప్రారంభించారు. బూస్టర్ డోస్ లో భాగంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ డోసులను అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజు రోజుకు కొవిడ్ తన రూపాన్ని మార్చుకుంటున్న తరుణంలో బూస్టర్ డోసులు తీసుకోవడం వల్ల మహమ్మారి భారి నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. తాను కూడా రెండ్రోజుల క్రితం బూస్టర్ డోస్ తీసుకున్నట్లు వివరించారు.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు.

వ్యాక్సిన్, మాస్క్, శానిటైజర్ వినియోగం ద్వారా మాత్రమే కరోనాను తరిమికొట్టగలమని వివరించారు. నాడు కరోనా వేవ్ తీవ్రంగా ఉన్నప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి రాక చాలా మంది తమ ప్రాణాలను కొల్పోయారని విచారం వ్యక్తం చేశారు కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు,వార్డు ఇన్ఛార్జీలు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెళ్లికి ఇవ్వాల్సిన చెక్కులు పిల్లలు పుట్టినంక ఇస్తురు

Satyam NEWS

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలి

Satyam NEWS

విద్యకు అత్యంత ప్రాధాన్యత

Murali Krishna

Leave a Comment