42.2 C
Hyderabad
May 3, 2024 18: 21 PM
Slider కడప

జనతా కర్ఫ్యూ ముందు మాంసం కోసం ఎగబడ్డ జనాలు

chicken shops

కడప జిల్లా రాజంపేట వ్యాప్తంగా కరోనా మహమ్మారి నియంత్రణ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రజలు ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించగా..కర్ఫ్యూ మొదలు కాకా ముందు జనం మాంసం కోసం ఎగ బడ్డారు. ఆదివారం కావడం ముఖ్యంగా జనతా కర్ఫ్యూ కావడంతో ప్రభుత్వం ఉదయం ఏడు గంటల తరువాత స్వచ్చందం గా తిరగవద్దని, వ్యాపారాలు మూసి వేయాలని ఆదేశించారు.

దీనితో ప్రజలు శనివారం ఆదివారం కు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు. గత రాత్రి మాంసం విక్రయాలు జోరుగా జరిగాయి. ఈరోజు తెల్లవారు జామున మాంసం దుకాణాలు తెరవడం తో జనాలు బారులు తీరి మరి కొనుగోలు చేశారు. దీనితో ఈ ప్రాంతం రద్దీ గా మారింది.

కరోనా మూలంగా చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయి ధర లు చాలా తగ్గిపోగా,శని,ఆదివారాల్లో అమ్మకాలు పెరగడంతో రోజుకంటే అధికంగా అమ్మారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కర్ఫ్యూ సమయానికి మూసివేసి సహాకరించాలని కోరడం తో వారు మూసివేశారు.

అనంతరం అన్నీ వ్యాపార సముదాయాలు మూతపడినాయి. ప్రజలు కూడా బయట తిరగలేదు.

Related posts

అర్హులైన వారు ఓటర్ గా నమోదు చేసుకోవాలి

Bhavani

హిందుత్వం పైనే అన్ని మతాల దాడులు

Satyam NEWS

మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావద్దు

Satyam NEWS

Leave a Comment