37.2 C
Hyderabad
May 2, 2024 14: 27 PM
Slider ముఖ్యంశాలు

పరిసరాలకు ఇబ్బంది లేకుండా భవనం కూల్చివేత

#Talasani Srinivas Yadav

పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భవనాన్ని కూల్చేందుకు తగిన జాగ్రత్తలు తీసుకొనడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి మినిస్టర్ రోడ్ లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన భవనం వద్దకు చేరుకున్నారు. భవనం కూల్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదం చాలా బాధాకరం అన్నారు.

ప్రమాదంలో మరణించిన ముగ్గురి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ను ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. ప్రమాద సమయంలో అన్ని శాఖల అధికారులు సకాలంలో తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పరిసర ప్రాంత ప్రజలను మున్నూరు కాపు సంఘ భవనంలోకి తరలించి వసతి, భోజన సౌకర్యాలను కల్పించినట్లు చెప్పారు. మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఎంతో శ్రమించారని అన్నారు. భవనాన్ని కూల్చేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.

టెండర్ ప్రక్రియ పూర్తయిందని, ఈరోజు సాయంత్రం వరకు కూల్చివేతే పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ, తహసీల్దార్ శైలజ, EE సుదర్శన్, టౌన్ ప్లానింగ్ ACP క్రిస్టోఫర్ తదితరులు ఉన్నారు.

Related posts

కరోనా సమయంలో సేవలు అందించిన R.M.P,P.M.Pలను గుర్తించాలి

Satyam NEWS

జగనన్న ఇండ్ల నిర్మాణం పై పవన్ తో చర్చకు సిద్ధం

Satyam NEWS

అమూల్ సేల్ పాయింట్లకు స్థలం కేటాయింపు ఆపాలి

Satyam NEWS

Leave a Comment