33.2 C
Hyderabad
May 11, 2024 14: 18 PM
Slider నెల్లూరు

దొంగతనం చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు

#headmistress

నెల్లూరు జిల్లా గుడిపల్లి పాడు పాఠశాలలో పిల్లలకు పోషకాహారం కింద ఇచ్చే కోడిగుడ్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దొంగిలించింది. ఈ చోరీ గమనించిన ఒక స్థానిక వృద్ధురాలు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది. దొంగతనాన్ని స్థానిక వృద్ధురాలు రుజువు చేసినా పోలీసులు మాత్రం చోరీ చేసిన టీచర్ ను వదిలేసి వృద్ధురాలిపై కేసు పెట్టాలు.

గుడిపల్లిపాడు అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రదానోపాధ్యాయురాలు పోషకాహారాన్ని(కోడి గుడ్లను) అపహరించి తీసుకెళుతుండగా అది గుర్తించిన స్థానిక వృద్ధురాలు ప్రధానోపాధ్యాయురాలును ఆపి కోడిగుడ్లను ఎందుకు తీసుకెళ్తున్నావని ప్రశ్నించడంతో ఉపాధ్యాయురాలు వృద్ధురాలపై దురుసుగా ప్రవర్తించింది. అయినా కూడా వృద్ధురాలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉపాధ్యాయురాలును గట్టిగా పట్టుకుని నిలదీయడం తో కోపోద్రిక్తురాలైన ఉపాధ్యాయురాలు వృద్ధురాలు పైన పోలీసుల కు కంప్లైంట్ చేసింది.

దాంతో దొంగతనం చేసిన ఉపాధ్యాయురాలు ఇచ్చిన పిటిషన్ ఆధారం గా పోలీసులు వృద్ధురాలుపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. కోడిగుడ్ల దొంగతనం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడం తో వైరల్ గా మారి జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కోడిగుడ్లు దొంగతనం చేసిన ఉపాధ్యాయురాలపై జిల్లా కలెక్టర్ అయిన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్ పోలీసు స్టేషన్ కు చేరుకుని జరిగిన ఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులను బాధ్యులుగా చేయవద్దని పోలీసులకు సూచించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ స్థానికులు నిలదీసి పోలీసులకు పిర్యాదు చేస్తే.. పోలీసులు స్థానికుల పై కేసు నమోదు చేస్తున్నారు..

దొంగతనం చేస్తుంటే అడ్డుకోకుండా పోలీసులు వచ్చే వరకు ఎదురు చూడాలనడం విచిత్రంగా ఉంది..దొంగను పట్టించిన వారి పై కేసు నమోదు చేస్తున్నారు..లక్ష రూపాయలు జీతం తీసుకుంటు పేద బిడ్డల కడుపు కొడుతుంటే పట్టుకోకూడదా..దొంగతనం చేసిన వాళ్లను విడిచిపెట్టి దొంగను పట్టుకున్న వాళ్ల పై కేసులు పెడితే న్యాయపోరాటం చేస్తాం అని టిడిపి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.

Related posts

మతాల మధ్య చిచ్చుపెడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం

Satyam NEWS

వైసీపీ నేతపై మహిళా వాలంటీర్ ఫిర్యాదు

Sub Editor

ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలపై సరికొత్త వివాదం

Satyam NEWS

Leave a Comment