40.2 C
Hyderabad
May 2, 2024 18: 00 PM
Slider తూర్పుగోదావరి

నిబంధనలకు తూట్లు: గణతంత్ర వేళ బార్లు బార్లా..

#liquor

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా సంబరాలు చేసుకుంటున్న క్రమంలో కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించి స్థానిక సుప్రియ బార్ యాజమాన్యం ఉదయం నుండి ఆహ్వానం పలకడం చర్చనీయాంశమైంది. గణతంత్ర దినోత్సవం నాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రోజున భారత రాజ్యాంగం ప్రకారం మద్యం, మాంసం అమ్మకాలు పూర్తిగా నిషేధం.

మాంసం విక్రయాలు జరిపినా మద్యం అమ్మకాలు సాగించినా బార్లు, మద్యం దుకాణాలు తెరిచినా నిబంధనల్లో పేర్కొన్న విధంగా సదరు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయి. అయితే అటువంటి నిబంధనలు ఏమీ కోనసీమ జిల్లా మండపేట దరికి చేరడం లేదు.

దీంతో పట్టణంలో మద్యం అమ్మకాలు విచ్చల విడిగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల బార్లు, ప్రభుత్వ మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు పూర్తిగా మూసేసినప్పటికీ పట్టణం నడిబొడ్డు కృష్ణా టాకీస్ పక్కన ఓ బార్ బార్లా తెరుచుకుంది. బార్ ముందు భాగం మూతేసి దొడ్డి దారిన సందిట్లో సడేమియా మాదిరిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.

సదరు నిర్వాహకుడు నన్నాపేది ఎవడు నన్ను అడ్డుకునేది ఎవడున్నాడు అనే అహంతో మద్యాన్ని మందుబాబులకు విక్రయిస్తున్నాడు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. గణతంత్ర దినోత్సవం నాడు నిబంధనలు కఠినతరం చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారని దేశభక్తులు మండి పడుతున్నారు. పైగా మద్యంతో పాటు మందుబాబులకు అక్కడ అన్ని వసతులు కల్పించారు.

వాటర్ సోడా డ్రింక్ మంచింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేసి మూడు నిబ్బులు ఆరు సోడాలు అన్నట్టుగా వ్యాపారం సాగిస్తూ రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు ముందు రోజు మామూళ్లు దండుకుని సుప్రియ బార్ కు అనధికార అనుమతులు జారీ చేసి ఉంటారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ వ్యవహారం పై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బార్ నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Related posts

ఆపత్కాలంలో ముందుకొచ్చి ఆదుకున్న రెడ్ క్రాస్ సొసైటీ

Satyam NEWS

జో బైడెన్ గెలుపును ఖరారు చేసిన అమెరికన్ కాంగ్రెస్

Satyam NEWS

విజయనగరం జిల్లాలో 9 కోర్టులలో లోక్ అదాలత్…ఎప్పుడంటే…?

Satyam NEWS

Leave a Comment