38.2 C
Hyderabad
April 28, 2024 19: 15 PM
Slider ఖమ్మం

ఓటర్ జాబితా నిబంధనల ప్రకారం చేయాలి

#Electoral Roll Observer

జిల్లాలో ఓటర్ జాబితాను పకడ్బందీగా రూపొందించాలని ఖమ్మం జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ పరిశీలకులు, చీఫ్ రేషనింగ్ అధికారిణి హైదరాబాద్ బి. బాల మాయాదేవి అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి ఎస్ఎస్ఆర్ -2023కి సంబంధించి జిల్లాలో ఓటరు జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర అంశాలపై ఈఆర్వోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా పరిశీలకులు జిల్లాలో ఆయా దరఖాస్తుల పరిష్కారం ఏ విధంగా చేశారు, ప్రాపర్ గా చేశారా లేదా అన్న విషయాలపై పరిశీలన చేశారు.

డెత్ కేసుల విషయంలో ఓటర్ జాబితాలో అన్ని అప్డేట్ చేయాలన్నారు. బిఎల్ఓలు ఆయా గ్రామాల్లో క్షేత్ర పరిధిలో పరిశీలించి, చనిపోయిన వారి వివరాలు, మరణ ధ్రువీకరణ, ఇతర వివరాలను సంబంధిత కుటుంబం నుండి గాని గ్రామ పంచాయితీ నుండి గాని సేకరించాలన్నారు. తొలగింపులకు సంబంధించి ప్రాపర్ గా జాగ్రత్తగా చేయాలన్నారు. ఫారం -7 కు సంబంధించి నోటీసులు ఇవ్వాలని, వెరిఫై చేసి ధృవీకరణ తీసుకోవాలన్నారు.

తిరస్కరించిన వాటికి సరైన కారణాలను పేర్కొనాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలన్న ఆలోచనతో కాకుండా, సమస్యలను పరిష్కరించాలని ఆలోచన చేయాలన్నారు. బిఎల్ఓ స్థాయిలోనే తప్పులు జరగకుండా చూడాలన్నారు. మరణించిన ఓటర్లను జాబితా నుంచి తొలగించాల్సిన బాధ్యత ఏఈఆర్ఓ లదని, ఆమె తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గం వారీగా ఫారం -6, 7, 8 లకు సంబంధించి సూపర్ చెక్ దరఖాస్తులను ఎలక్ట్రోరల్ రోల్ పరిశీలకులు, జిల్లా కలెక్టర్ లు పరిశీలించారు.

అనంతరం ఆమె ఫారం-6, 7, 8 సూపర్ చెక్ చేయాలని ఈఆర్ఓలకు సూచించారు. చనిపోయిన, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, మార్పులు చేర్పుల విషయంలో పలు సూచనలు ఇచ్చారు. సమీక్ష లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, జిల్లాలో ఫారం 6,7,8 లకు సంబంధించి 78051 దరఖాస్తులు వచ్చినట్లు, 61650 దరఖాస్తులు పరిశీలన చేయడం జరిగిందని ఎలక్ట్రోరల్ రోల్ పరిశీలకులకు తెలిపారు.

రెండు రోజుల లోగా అన్ని దరఖాస్తులను పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. మార్గదర్శకాల మేరకు దరఖాస్తుల సూపర్ చెక్ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన అన్నారు. 47 వేల ఎపిక్ కార్డులు జనరేట్ చేయగా, ఇప్పటి వరకు 28 వేల కార్డులు వచ్చినట్లు, వీటి పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.

సత్యప్రసాద్, మధుసూదన్ నాయక్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, ఆర్డీవోలు జి. గణేష్, అశోక్ చక్రవర్తి, ఎస్డీసి రాజేశ్వరి, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉపాధ్యాయులు విద్యార్థుల భావి జీవిత నిర్మాతలు

Satyam NEWS

నేరస్తులను గుర్తిస్తున్న సిసి కెమెరాలు

Satyam NEWS

రండి రండి ప్లవ గారూ!

Satyam NEWS

Leave a Comment