33.7 C
Hyderabad
April 29, 2024 23: 07 PM
Slider ఖమ్మం

పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ధి

#Development

పట్టణానికి ధీటుగా గ్రామాలను అభివృద్ధి పర్చి సకల మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. రఘునాథపాలెంలో రూ.1.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం కోయచలక, రేగులచలక గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, డొంక రోడ్లు, హై మాస్ట్‌ లైట్స్‌ ను ప్రారంభించుకున్నామన్నారు. కోయచలక గ్రామంలో సీసీ రోడ్స్‌ మరియు సీసీ డ్రెయిన్ల కోసం ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ నిధులు రూ.30లక్షలు, ఎస్‌డిఎఫ్‌ నిధులు రూ.10 లక్షలు, సిఎస్‌ఆర్‌ ట్రాన్స్‌కో నిధులు రూ.17లక్షలు (డొంక రోడ్లు) సుడా నిధులు రూ.3.50 లక్షలతో హై మాస్ట్‌ లైట్స్‌ మొత్తం రూ.60.50 లక్షాతో నిర్మించిన పనులను ప్రారంభించారు.

రేగుల చలక గ్రామంలో సీసీ రోడ్స్‌ కోసం ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ నిధులు రూ.33.50 (ఎనిమిది రోడ్స్‌), ఎస్‌డిఎఫ్‌ నిధులు రూ.10 లక్షలు(మూడు రోడ్స్‌), సిఎస్‌ఆర్‌ ట్రాన్స్‌కో నిధులు రూ.13 లక్షలు(రెండు డొంక రోడ్లు) సుడా నిధులు రూ.3.50 లక్షలతో హై మాస్ట్‌ లైట్స్‌ మొత్తం రూ.60 లక్షలతో అభివృద్ది పనులను ప్రారంభించారు. సిద్దిపేట, సిరిసిల్ల , గజ్వేల్‌ లో జరిగిన అభివృద్ది మన ఖమ్మంలో జరిగింది అని స్పష్టం చేశారు. మన ఖమ్మం లో జరిగిన అభివృద్ది ని చుసి ఇతర జిల్లాలు అనుసరించడం మనకు గర్వకారణం అన్నారు.

కార్యక్రమంలో ఎంపిపి గౌరీ, వైస్‌ ఎంపిపి గుత్తా రవి, సర్పంచ్‌ లు మాదంశెట్టి హరిప్రసాద్‌, రామారావు, వైస్‌ సర్పంచ్‌ లు చెరుకూరి పూర్ణ, నున్నా వెంకటేశ్వర్లు, ఆత్మ చైర్మన్‌ లక్ష్మణ నాయక్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, మందడపు నర్సింహారావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, ఎంపిటిసి బలుసుపాటి సుజాత, నాయకులు కుర్రా భాస్కర్‌ రావు, నున్నా శ్రీనివాస్‌, చెరుకూరి బిక్షమయ్య, పిన్ని కోటేశ్వరరావు, మందడపు సుధాకర్‌ తదితరులు ఉన్నారు

Related posts

రఘురామపై లోకసభ స్పీకర్‌కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు

Satyam NEWS

విక్రమ సింహపురి యూనివర్సిటీలో గాంధీ వర్ధంతి

Satyam NEWS

కరోనా కోరల నుంచి బయటపడిన అమితాబ్ బచ్చన్

Satyam NEWS

Leave a Comment