37.2 C
Hyderabad
April 30, 2024 14: 21 PM
Slider ఖమ్మం

గృహలక్ష్మి ద్వారా ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్ధిక సాయం

#Griha Lakshmi

ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు వారి ఆధీనంలో ఉన్న ఇంటి స్థలాన్ని వారికే పూర్తి హక్కులు కల్పించి నిశ్చింతగా జీవంచేందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేసి ప్రభుత్వ ఉత్వర్వునెం.58 పథకం క్రింద పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, అదేవిధంగా ఇంటి స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునే ఆర్ధిక స్తోమత లేని వారికి కూడా ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్ధిక సహాయం అందించేందుకు గృహలక్ష్మి పథకానికి రూపకల్పన చేయడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని జీవో నెం.58, 59 పట్టాలు, మరియు 4, 5, 6, 7, 8, 9, 10, 14, 16, 22, 26, 31, 32, 36, 37, 39, 40, 41, 50, 58వ డివిజన్ లబ్ధిదారులకు గృహలక్ష్మీ పథకం కింద మంజూరైన మంజూరు పత్రాలను మంత్రి పువ్వాడ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. ఎన్నో ఏండ్ల నాటి పేదల కలలను జీవో 58, 59ల ద్వారా సీఎం కేసీఆర్‌ గారు సాకారం చేశారని, పేదలకు స్థలాలు క్రమబద్ధీకరణ చేయడం గొప్ప విషయమని చెప్పారు. పేదలకు పట్టాలు ఇవ్వడంతో వారిలో ధైర్యం పెరిగిందన్నారు. దీంతో పాటు సొంత జాగా ఉన్న పేదలకు గృహలక్ష్మి పథకంతో పేద, మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటి కలను సీఎం కేసీఆర్‌ గారు నెరవేర్చారు చెప్పారు.

ప్రభుత్వ భూముల్లో ఆక్రమణ చేసుకుని ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ఆ స్థలం వారికే చెందే విధంగా ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు.జివో నెం.58 ద్వారా ప్రజల నుండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు అందజేశామని, జీవో.నెం.59 లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్ణయించిన నామ మాత్రపు ఫీజును తీసుకుని వారి పట్టాలు అందిస్తున మన్నారు.పేదల కోసం ఇలాంటి మహత్తర కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం కు మీరంతా రుణపడి ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ను కాపాడుకుని అత్యధిక మెజారిటీతో గెలిపించు కోవాలని కోరారు.

జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ మాట్లాడుతూ పేద ప్రజలు స్వంత నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఏదో ఒక నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్న వారు వేల సంఖ్యలో భయం భయంగా జీవించే వారని, అట్టి వారి స్థితిగతు లను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి హక్కు కల్పించాలనే సంకల్పంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వ ఉత్వర్వు నెం.58 క్రింద రెగ్యులరైజ్‌ చేయలని ఆదేశించడం జరిగిందని, కలెక్టర్‌ తెలిపారు.

కార్యక్రమంలో మయర్ పునుకొల్లు నీరజ, డెప్యూటీ మేయర్ ఫాతిమా జోహర, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోరేపల్లి శ్వేత, డెప్యూటీ మున్సిపల్ కమిషనర్ మల్లీశ్వరి, అర్ డి ఓ గణేశ్, తహసిల్దార్ స్వామి, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ,పగడాల నాగరాజు, కమర్థపు మురళి, వలరాజు, అధికారులు ఉన్నారు.

Related posts

ఇష్టారాజ్యంగా వైన్ షాప్ ల ఏర్పాటు…

Satyam NEWS

మతం మారిన వారికి ఎస్ సి పథకాలు వర్తించవు

Satyam NEWS

31న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

Leave a Comment