38.2 C
Hyderabad
April 28, 2024 21: 41 PM
Slider నిజామాబాద్

గుడ్ గోయింగ్: మనేపూర్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు

bichkunda

బిచ్కుంద  మండలంలోని మానేపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వైకుంఠ ధామం డంపింగ్ యార్డు నర్సరీల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. గతంలో ఈ గ్రామం శాంతాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది కానీ నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పాట్లలో ఈ గ్రామం  నూతన గ్రామ పంచాయితీగా ఆవిర్భవించింది.

దీంతో నూతనంగా ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్ దాసరి రాములు మొట్టమొదటి సర్పంచ్ కావడంతో గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి అధికారులు సహాయ సహకారాలతో వైకుంఠ ధామం డంపింగ్ యార్డు, నర్సరీ పనులతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాలు దగ్గరుండి ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారు. ఈపాటికే వైకుంఠ ధామం పనులు ఆలస్యం కావడంతో ఆయన దగ్గరుండి వాటి నిర్మాణం చేపట్టే విధంగా ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు.

వీటితో పాటు గ్రామంలో ప్రధాన వీధుల్లో పచ్చటి ఆహ్లాదకరమైన మొక్కలు నాటారు. సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు కూడా మంజూరయ్యాయని ఆయన సత్యం న్యూస్ తో తెలిపారు. బుధవారం దగ్గరుండి డంపింగ్ యార్డు వైకుంఠ ధామం నర్సరి పనులను సత్యం న్యూస్ తో కలిసి పరిశీలించారు. గ్రామస్తుల అధికారులు పంచాయతీ పాలకవర్గ సభ్యుల సహకారంతో  గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ అధిగమించేందుకు కృషి చేస్తానని దానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారన్నారు. నూతన పంచాయతీ భవనం లేకపోవడంతో ఇరుకు గదుల్లో పరిపాలన సాగిస్తున్నామని నూతన పంచాయతీ  భవనం నిర్మాణం కొరకు తీర్మానం కూడా అధికారులకు అందజేశామన్నారు. గ్రామంలో ఇప్పటికే తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన ఈ సందర్భంగా సత్యం న్యూస్ తో  తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోపాటు పంచాయతీ కార్యదర్శి మనోజ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకట్  రెడ్డి ఉన్నారు.

Related posts

శాల్యూట్: కరోనాకు పవన్ కళ్యాణ్ సాయం రూ.2 కోట్లు

Satyam NEWS

ఈ రెండేళ్లలో 70 వేల మంది సైనికులకు కరోనా

Sub Editor

కామెడీ పేరుతో బ్రాహ్మణులపై వెకిలి డైలాగులు

Satyam NEWS

Leave a Comment