30.7 C
Hyderabad
April 29, 2024 03: 29 AM
Slider ప్రత్యేకం

వయసు చిన్నదే అయినా…మనసు మాత్రం పెద్దది

#SocialService

స్వార్ధ పూరితమైన నేటి సమాజంలో నిస్వార్థంగా ‘మనవ సేవే మాధవ సేవ’అని భావించి ఎందరినో అభాగ్యులను ఆదరించి అక్కున చేర్చుకుని సేవలు అందిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్న సంస్థ ‘బ్రతుకు బ్రతికించు’.

ఈ సంస్థ ఫౌండర్ బాజీఉల్లా  వృత్తి రీత్యా డ్రైవర్, ప్రవృత్తి రీత్యా మానవ సేవా తత్పరాయణుడు. వయసున చిన్న తనమైనా పెద్ద మనసుతో తాను సంపాదించిన దానితో నిర్భాగ్యులకు,పేద వారికి తోడ్పడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన ‘బ్రతుకు బ్రతికించు’ ఫౌండర్ బాజి

విజయవాడ సమీపంలోని  గూడురు గ్రామ సమీపంలో నివసిస్తున్న ఒంటరి పేద ముదుసలి (వయో వృద్ధుల)వారి పదిహేను కుటుంబాలను బాజి దత్తత తీసుకుని వారిని కంటికి రెప్పలా ఆదుకుంటున్నాడు.

ప్రతి నెలా ఆ వయో వృద్ధులకు సరిపడు బియ్యం , నిత్యావసర వస్తువులును దగ్గరుండి తనే అందజేస్తున్నాడు.

గతంలో 16 చేనేత కార్మిక కుటుంబాలను దత్తత తీసుకుని  వారిని ఆదుకున్న మనసున్న మహా మనిషి.

ఈ సందర్భంగా బాజీ ఉల్లా మాట్లాడుతూ ఇలాంటి మరెన్నో  సేవా కార్యక్రమాలు ‘బ్రతుకు బ్రతికించు’ ఫౌండేషన్ ద్వారా ఇంకా చేస్తామని అన్నారు.

“సేవే పరమావధిగా భావించిన బాజీ కి తోడ్పాటు అందించాలని “కోరుతూ…..

బి చంద్రశేఖర్, సత్యం న్యూస్

Related posts

తెలంగాణ గవర్నర్ తో పురందేశ్వరి భేటీ

Satyam NEWS

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకే ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌

Sub Editor

మిలీనియం టవర్స్ లో సెక్రటేరియేట్ పై నేవీ అభ్యంతరం

Satyam NEWS

Leave a Comment