33.7 C
Hyderabad
April 29, 2024 01: 04 AM
Slider మహబూబ్ నగర్

సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన వనపర్తి జిల్లా ఎస్పీ

#rakshitamurthy

ఎన్నికల నిర్వహణకు  అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లు సరిచూసుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కె. మూర్తి ఎస్ఐలను  ఆదేశించారు. బుధవారం  ఘనపూర్,  పెద్దమందడి కొత్తకోట మండలాలలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. నవంబర్ 30 న జరిగే వనపర్తి అసెంబ్లీ పోలింగ్ ప్రక్రియ సజావుగా పకడ్బందీగా జరగడానికి చేపట్టాల్సిన చర్యల పై దిశా నిర్దేశం చేశారు.  

అన్ని పోలింగ్ కేంద్రాల్లో  పోలింగ్ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో చూసుకోవాలని సంబంధిత  సిఐ ని, ఎస్ ఐలను ఎస్పీ  ఆదేశించారు. తాగు నీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, ఫర్నిచర్ వంటి సౌకర్యాలతో పాటు సి.సి. కెమెరాలు అమర్చడానికి అనువైన ప్రదేశం, దాని భద్రత వంటి అంశాలు చూసుకోవాలని సూచించారు.   ఈ కార్యక్రమంలో కొత్తకోట సిఐ శ్రీనివాసరెడ్డి, ఘనపూర్ ఎస్సై శ్రీహరి, పెద్దమందడి ఎస్సై హరిప్రసాద్, కొత్తకోట ఎస్సై మంజునాథ్ రెడ్డి  పాల్గొన్నారు.

వనపర్తిలో బార్ సిజ్

వనపర్తి పట్టణంలోని కొత్తకోట రోడ్డు వైపులో గల శ్రీనివాస బార్ అండ్ రెస్టారెంట్ అండ్  మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నందుకు వనపర్తి జిల్లా ప్రొబిషన్  అండ్ ఎక్సైజ్ అధికారి కే.ప్రభు వినయ్ తేది 15/11/2023 నాడు సీజ్ చేశారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

జులై 3 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

Satyam NEWS

వనపర్తి జిల్లాలో గంజాయి, గుట్కా, పేకాటపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి

Satyam NEWS

బిసి చైతన్య సభను జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment