27.7 C
Hyderabad
April 30, 2024 10: 39 AM
Slider విశాఖపట్నం

విజయనగరం లో మున్సిపల్ పోలింగ్ పర్యవేక్షించిన రేంజ్ డీఐజీ

#VizagDIG

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తి అయింది. ఓ వైపు జిల్లా కలెక్టర్, ఎస్పీ లు పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ క్రమంలోనే విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు.. విజయనగరం లో పర్యటించారు.

మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో నగరంలో ని వీటీ అగ్రహారం, జొన్నగుడ్డి లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. తొలుత వీటీ అగ్రహారం లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని డీఐజీ రంగారావు సందర్శించి అక్కడ నుంచీ సంస్కృతిక కళాశాల లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.

అక్కడే ఎన్నికల విధులను నిర్వహిస్తున్న పీఓను పోలింగ్,ఓటింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. కేవలం యాభై శాతం జరిగిందని పీఓ చెప్పడంతో…పోలింగ్ పై ఓటర్లలో చైతన్యం, అవగాహన కల్పించడంలో విఫలం అయ్యారని డీఐజీ అన్నారు.

పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తక్కువ గా ఉండటం చూసి..అనవసరంగా ఇక్కడ కు వచ్చామని ఏఆర్ డీఎస్పీ, విజయనగర డీఎస్పీ,భోగాపురం సీఐలతో డీఐజీ అన్నారు. అనంతరం అక్కడే విధులు నిర్వర్తిస్తున్న మహిళా సంరక్షణ క పోలీసులతో డీఐజీ మాట్లాడారు.

ఐడీ కార్డులు ఇచ్చారా..?భోజనాలు చేసారా..? మా వాళ్లు పెట్టారా అంటూ ఎంఎస్పీలను డీఐజీ ప్రశ్నలు వేసారు.భోజనం అందలేదన్న సమాధానం వాళ్ల నుంచీ రావడంతో..వెంటనే డీఎస్పీని ఆదేశించారు.

అనంతరం మీడియా తో మాట్లాడుతూ రేంజ్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.డీఐజీ వెంట.. ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, విజయనగర డీఎస్పీ అనిల్ ,నగర వన్ టౌన్ సీఐ మురళీ ,భోగాపురం సీఐ శ్రీధర్, వన్ టౌన్ ఎస్ఐ దేవీలు ఉన్నారు.

Related posts

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Satyam NEWS

మంగళగిరి పట్టణంలో సరిగాలేని కరోనా సమాచారం

Satyam NEWS

దీపావళి సందర్భంగా పితృదేవతలకు ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment