38.2 C
Hyderabad
May 1, 2024 20: 20 PM
Slider ముఖ్యంశాలు

దివ్యాంగులకు క్రీడా పోటీలు

#physicallychallenged

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వెంకటలక్ష్మి తెలిపారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 23 నుండి దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జెడ్పి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దివ్యాంగులకు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లుగా ఆమె తెలిపారు.

ఉదయం 9:30 నిమిషాలకు దివ్యాంగులు జూనియర్స్ 10 నుండి 16 సంవత్సరాల సీనియర్స్ 17 నుండి 54 సంవత్సరాల రెండు విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే దివ్యాంగులు పుట్టిన తేదీ నిర్ధారణ ధ్రువీకరణ పత్రం తో పాటు, గుర్తింపు కార్డు ఆధార్ సదరం స్టడీ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. పరుగు పందెం పోటీల్లో పాల్గొనేవారు ఎవరి ట్రైసైకిల్ వారే తెచ్చుకోవాలన్నారు

జిల్లాలోని శారీరక అంద భధిర మానసిక దివ్యాంగులు దివ్యంగా సంగం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు 40% దాటిన అన్ని రకాల వైకల్యం కలిగిన స్త్రీ పురుష దివ్యాంగులకు ఆర్టీసీ నాగర్ కర్నూల్ వారు ఉచితబస్ పాస్ ఏడాది కాలానికి అందజేస్తారని చెప్పారు. పైన తెలిపిన పత్రాలతో పాటు ఒక ఫోటో జిల్లా జెడ్పిమైదానంలో డి డబ్ల్యు ఓ ను కలవాలని సూచించారు.

Related posts

ప్ర‌పంచ హృద‌య దినోత్స‌వం: ఎస్పీ దీపికా జెండా ఊప‌డంతో ప్రారంభ‌మైన ర్యాలీ

Satyam NEWS

ములుగు నియోజకవర్గంలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుక

Bhavani

దాడికి గురైన సైదులు, సింగమోహన్ రావు లను పరామర్శించిన ఉత్తమ్

Satyam NEWS

Leave a Comment