29.7 C
Hyderabad
April 29, 2024 08: 30 AM
Slider నల్గొండ

CITU ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం

#CITUHujurnagar

మహిళలకి 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలం చెందాయని,అధికారంలో ఉన్న పార్టీలు గతంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు తీసుకు వస్తే ములాయంసింగ్ మరికొందరు వ్యతిరేకించారని అన్నారు.

భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీలు మహిళలను ఆకాశానికి ఎత్తి 33 శాతం రిజర్వేషన్ కల్పించడంలో పూర్తిగా విఫలం చెందాయని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి విమర్శించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని CITU కార్యాలయంలో రోషపతి మాట్లాడుతూ నేటి వరకు పురుషులతో పాటు మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని అన్నారు. మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టి వివాహం చేసుకునే వారికి అదనంగా మూడు లక్షలు ఇవ్వాలని కోరారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలోని సిఐటియు కార్యాలయం వద్ద బాలాజీ రైస్ మిల్లులో గత ముప్పైనాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న కాకి నరసమ్మతో పాటుగా మరికొందరు మహిళలను ఘనంగా సన్మానించారు.

నేడు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా రైస్ మిల్లులో పని చేసే వారికి రోజు కూలీ పెంచాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యలక సోమయ్య గౌడ్, అధ్యక్ష్య, కార్యదర్శులు సామల కోటమ, గోపమ్మ, గుండెబోయిన వెంకన్న, అంజి, బాలయ్య, మిన్ను నరసమ్మ, రాణి,దేవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

వకీల్ సాబ్ ను చూసి భయపడుతున్న సిఎం సాబ్

Satyam NEWS

ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఏలూరు మేయర్ అభ్యర్ధి

Satyam NEWS

నవంబర్ 2 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం..

Sub Editor

Leave a Comment