38.2 C
Hyderabad
April 27, 2024 15: 53 PM
Slider రంగారెడ్డి

ప్రజావాణి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

#vikarabadcollector

ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ పెట్టుకున్న అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగార్, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, డి ఆర్ డి ఓ కృష్ణన్ లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్ లో ఉంచుకోకుండా సత్వరమే పరిష్కరించాలని తెలిపారు.  ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలను నుండి మొత్తం 331 దరఖాస్తుల స్వీకరించారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రతి జిల్లా అధికారి తన శాఖపై పూర్తి పట్టు సాధించి తమ సిబ్బందితో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే విధంగా పనిచేయాలని అన్నారు. గత 15 రోజులుగా చేపట్టిన చర్యల ఫలితంగా పనులలో పురోగతి కనిపిస్తుందని ఇదేవిధంగా అధికారులందరూ టీం వర్క్ గా పనిచేసి పనులలో పురోగతి సాధించి జిల్లాను టాప్-5 స్థాయి లో ఉంచాలన్నారు. మార్చి మాసాంతం వరకు 60 కోట్ల రూపాయల అంచనాల వ్యయంతో  కూడిన రోడ్ల నిర్మాణపు పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లా యంత్రాంగం తరఫున అధికారులకు అవసరమైన పూర్తి సహాయ సహకారం ఉంటుందని ఆయన అన్నారు.  గ్రామస్థాయిలో ప్రజలకు ప్రతిరోజు మంచి సేవలు అందించాలని అన్నారు.

పాఠశాలలో మంచి విద్య, అంగన్వాడి కేంద్రాలలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టిక ఆహారం, రేషన్ దుకాణాల ద్వారా ఎప్పటికప్పుడు సరుకులు అందించడంతోపాటు పారిశుద్యం, త్రాగునీటి సరఫరా  అందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు.  ప్రజలు ప్రజా ప్రతినిధులు మీడియా ప్రతినిధులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవాలని అధికారులకు సూచించారు.  ఎప్పుడు కూడా అధికారులకు తలదించుకునే పరిస్థితి రాకూడదని ప్రజలలో నమ్మకం కలిగించే విధంగా పనిచేసి జిల్లాను రాష్ట్రంలోనే టాప్ 5  గా నిలపాలన్నారు. 

30-35 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత చేసిన మంచి పనులను గుర్తుచేసుకొని సంతృప్తి కలిగేలా ఉండాలని అన్నారు. ఈ అవకాశం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉంటుందని  అన్నారు.  ప్రతిరోజు అటెండెన్స్ యాప్ ను రివ్యూ చేసుకునే బదులు ఇక నుండి అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించే స్థాయికి రావాలన్నారు. పని దినాలలో సమయపాలన పాటిస్తూ బాగా పనిచేసి, ప్రభుత్వ సెలవు దినాలను సొంత పనులకు వినియోగించుకోవాలని సూచించారు.  అధికారులందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ప్రతిరోజు వాకింగ్ చేయాలని సూచించారు.  త్వరలో కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు యోగా తరగతులను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు.

Related posts

పాకిస్తాన్ అధికార మార్పిడిలో ‘‘విదేశీ కుట్ర’’ లేదు

Satyam NEWS

18వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు

Satyam NEWS

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి ఖాయం

Satyam NEWS

Leave a Comment