31.7 C
Hyderabad
May 2, 2024 10: 49 AM
Slider విజయనగరం

విజయనగరం దిశ మహిళా పోలీస్ స్టేష‌న్ ఆక‌స్మిక త‌నిఖీ

#disa police station

ప‌ద‌కొండు రోజుల్లో ఆరు స్టేష‌న్ల ను పరిశీలించారు విజయనగరం ఎస్పీ దీపికా పాటిల్.

తొలిసారిగా విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ పీఎస్ సంద‌ర్శ‌న‌

రెండోసారి గ‌జ‌ప‌తిన‌గ‌రం ,బొండ‌ప‌ల్లి పీఎస్ ల త‌నిఖీ

మూడోసారి పూస‌పాటిరేగ‌,డెంకాడ పీఎస్ ల ప‌రిశీల‌న‌

తాజాగా జిల్లా కేంద్రంలోని సీఎం జ‌గ‌న్ మాన‌స పుత్రిక అయిన దిశ పీఎస్ విజిట్

ఇవీ చార్జ్ తీసుకున్న విజ‌య‌నగ‌రం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ఆకస్మికంగా విజిట్ చేసిన పీఎస్ ల వివ‌రాలు. ఈ నెల 12 న  విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఎస్పీ దీపికా పాటిల్, గ‌తంలో పార్వ‌తీపురం ఓఎస్డీగా ప‌ని చేసే అనుభ‌వం ఉన్నా..జిల్లాకు ఎస్పీగా రావ‌డంతో కింది స్థాయి సిబ్బంది ప‌నితీరు, పోలీస్ స్టేష‌న్ల‌లో విధులు నిర్వ‌హిస్తున్న సిబ్బంది ప‌నిత‌నం, స్టేష‌న్  ప‌రిస‌ర ప్రాంతాలను ప‌రిశీలించే ప‌నిలో ప‌డ్డారు…కొత్త ఎస్పీ దీపికా పాటిల్.

తాజాగా జిల్లా  కేంద్రంలోని బ్యారక్స్ స‌మీపంలో సీఎం జ‌గ‌న్ మాన‌సిక పుత్రిక దిశ పోలీస్ స్టేష‌న్ ను ఎస్పీ దీపికా పాటిల్ ఈ సాయంత్రం ఆక‌స్మికంగా త‌నిఖీ చేసారు.ఆ పీఎస్ ప‌క్క‌నే  ఉన్న పోలీస్ గెస్ట్ హౌస్ లో ఎస్పీ దీపికా పాటిల్ ఉంటున్నారు.

నిన్న‌నే  ఆమె భ‌ర్త విక్రంత్ పాటిల్ విజ‌య‌న‌గ‌రం స‌మీపంలో ఉన్న 5  బెటాలియ‌న్ కమాండెంట్ గా బాధ్య‌తలు తీసుకున్నారు. ఇక రేపో మాపో ఎస్పీ దీపికా పాటిల్..బంగ్లాకు మార‌నున్నారు. గ‌తంలో  జిల్లాలో ఓఎస్డీగా ప‌ని చేసే అనుభ‌వం ఉన్న ఎస్పీ దీపికా పాటిల్…ఒక్కోక్కో పీఎస్ ను నిశితంగా త‌నిఖీ చేసి స్టేష‌న్ ల‌లో రికార్డుల‌ను ప‌రిస‌ర ప్రాంతాల‌ను ప‌రిశీలిస్తున్నారు.

తాజాగా విజయనగరం లోని దిశా మహిళా పోలీసు స్టేషన్  జిల్లా ఎస్పీ  దీపికా పాటిల్ ఆక‌స్మికంగా సందర్శించారు. దిశా పోలీసు స్టేషన్ లో రికార్డులను, రిసెప్షన్ రికార్డులను, దర్యాప్తులో ఉన్న కేసు ఫైల్స్ ను పరిశీలించారు.

అనంతరం, పోలీసు స్టేషను భవనాన్ని, పరిసరాలను పరిశీలించి, సిబ్బంది, అధికారులతో మాట్లాడి, వారు నిర్వర్తిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషను పనితీరు, సిబ్బంది, అధికారుల గురించి దిశా డిఎస్పీ టి.త్రినాధ్ జిల్లా ఎస్పీకి వివరించారు  పోలీసు స్టేషన్ ను  ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా పని చేయాలని సిబ్బందికి సూచించారు.

మహిళల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నందున ప్రతీ ఫిర్యాదుదారుని పట్ల సానుకూలంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి ఇబ్బందులను తెలుసుకొని, చట్ట పరిధిలో వారికి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దిశా మహిళా పిఎస్ ఎస్ఐలు గణేష్, ప్రకాష్, కేటిఆర్, లక్ష్మి, ఏఎస్ఐ ర‌జ‌నీ, దిశా మహిళా పిఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

తాడిపూడి ఏపీఆర్ జేసీ పిల్లలు క్షేమం..

Satyam NEWS

చిన్నతనం నుండి సేవా దృక్పథం అలవర్చుకోవాలి

Satyam NEWS

కరోనా రోగుల సేవలో మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment