26.7 C
Hyderabad
May 3, 2024 08: 51 AM
Slider వరంగల్

జిల్లా స్థాయి కృత్య  మేళాను విజయవంతం చేయాలి

#mulugu

తెలంగాణ విద్యా దినోత్సవం రోజు నిర్వహించనున్న కృత్యమేళాను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలిమెట్టు లో భాగంగా ములుగు జిల్లా స్థాయి కృత్యమేళాను జూన్ 20వ తేదీన చల్వాయి ఆదర్శ పాఠశాల యందు నిర్వహించనున్నట్లు, ఇందులో తెలుగు, ఆంగ్లము, గణితము మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ కు సంబంధించి మొత్తం 90 ఎగ్జిబిట్స్ తో 90 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు వారు తెలిపారు. ఇందులో నుండి  ప్రతి సబ్జెక్టుకు రెండు చొప్పున ఎనిమిది ఎగ్జిబిట్లు మరియు ఉపాధ్యాయులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని వారు తెలిపారు. మరింత సమాచారం కోసం సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి ని సంప్రదించాలని తెలిపారు. తొలి మెట్టు కార్యక్రమం సమన్వయకర్త బద్దం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కృతమేళాకు ఉదయం 10 గంటలకు ఉపాధ్యాయులు సంబంధిత  టిఎల్ఎం ఎగ్జిబిట్ మరియు రాత ప్రతి తో విధిగా సకాలంలో హాజరుకావాలని కోరారు.

Related posts

ఇయర్ ఎండ్ లో గుడ్ న్యూస్ చెప్పిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…!

Satyam NEWS

దిగ్విజయంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం”

Sub Editor

కార్మికులను బానిసత్వం లోనికి నెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది

Satyam NEWS

Leave a Comment