29.7 C
Hyderabad
May 3, 2024 03: 22 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ కోవిడ్  సెంటర్ ను సందర్శించిన  DM & HO

#hujurnagarmunicipality

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని  ప్రాంతీయ వైద్యశాల లోని కోవిడ్  ఐసోలేషన్ సెంటర్ ను జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటా చలం గురువారం సందర్శించి చికిత్స పొందుతున్న రోగి ఆరోగ్య పరిస్థితిపై  వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కోవిడ్ సెంటర్ నందు ఆక్సిజన్, బెడ్స్  గురించి వైద్యశాల సిబ్బంది ద్వారా వివరాలు అడగగా మొత్తం 20 పడకలకు గాను 6 పడకలకు  ఆక్సిజన్ ఏర్పాటు ఉన్నట్లు తెలిపారు. పూర్తి బెడ్ లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించేందుకు  ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కరోనా వాక్సిన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన పిదప ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 3T విధానం (టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్)ద్వారా covid ను అరికట్టనున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరూ తప్పని సరి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూగా సబ్బుతో చేతులు శుభ్ర పరచుకోవడం మరువ కూడదన్నారు.45 సంవత్సరాల పైబడిన  వారందరు వాక్సిన్ తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో Dr.రవి, CC.భాస్కర్ రాజు,NHM కో – ఆర్డినేటర్ కిరణ్, హెల్త్ అసిస్టెంట్ ఇందిరాల రామకృష్ణ, రమా, త్రివేణి, ఇమాంబీ, శివప్రియ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తొలి సారి…ఏజన్సీ ఏరియాలో పర్యటించిన విజయనగరం లేడీ ఎస్పీ

Satyam NEWS

రోడ్ల వెడల్పులో నష్టపోయిన వారిని ఆదుకుంటా

Satyam NEWS

బాబూ జగ్జీవన్ రామ్ కు ఎమ్మెల్యే కాలేరు ఘన నివాళి                                        

Satyam NEWS

Leave a Comment