38.2 C
Hyderabad
April 29, 2024 14: 28 PM
Slider వరంగల్

ఇష్టారాజ్యంగా వైన్ షాప్ ల ఏర్పాటు…

#mulugudist

ములుగు జిల్లా జంగాలపల్లి ఎన్ హెచ్ వెంబడి బ్రాహ్మణి విద్యాలయం పక్కన వైన్ షాపులు ఏర్పాటు చేస్తుండగా పాఠశాలల్లోని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల సమీపంలోని వైన్ షాపులు నిర్వహించకూడదని స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారులకు పాఠశాల కరస్పాండెంట్ కర్ర రాజేందర్ రెడ్డి విన్నవించినప్పటికీ బ్రాందీ షాప్ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి పొందామని బ్రాందీ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు.

ములుగు ఎక్సైజ్ శాఖ పరిధిలో నిర్వహించబడే వైన్ షాపుల ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా  ఉన్నాయని  ప్రజలు ఆరోపిస్తున్నారు. జంగాలపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారిని ఆనుకుని వైన్ షాప్ ఏర్పాటుతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్పి ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. జంగాలపల్లి జాతీయ రహదారిపై పాఠశాల పక్కన నిర్వహిస్తున్న బ్రాందీ షాపును వెంటనే తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి మద్యం షాపులు నిర్వహించడం సమంజసం కాదని పాఠశాల పక్కన మద్యం షాపులను ఏర్పాటు చేయడం మూలంగా బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయని జిల్లా శాఖ అధికార యంత్రాంగం స్పందించి పాఠశాల పక్క నుండి బ్రాందీ షాప్ తొలగించి జాతీయ రహదారి పై నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులను నిర్వహించకూడదని గ్రామస్థులు, బ్రాహ్మణి విద్యాలయం కరస్పాండెంట్ కర్ర రాజేందర్ రెడ్డి, విద్యార్థులు కోరుతున్నారు.

Related posts

విశాఖ ఉక్కు అమ్మేస్తున్న బీజేపీ కి మద్దతు ఇవ్వడం సిగ్గు చేటు

Satyam NEWS

ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహించాలి

Murali Krishna

హౌ టు విన్:రేవంత్ దెబ్బకు మల్లారెడ్డి మంత్రి పదవి మటాష్

Satyam NEWS

Leave a Comment