38.2 C
Hyderabad
May 3, 2024 20: 02 PM
Slider గుంటూరు

కోవిడ్ పేరుతో పగటిపూట 144 సెక్షన్ అమలు చేయవద్దు

#navataramparty

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పగటిపూట పోలీసు శాఖ 144 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేసారు. కరోనా వ్యాప్తి చెందకుండా రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.

దానికి ప్రజలు సహకరిస్తారు అని,కానీ పగలు చిన్న వ్యాపారులు నుండి కూలీలు వరకు అన్నీ రకాల వ్యాపారాలు ఇబ్బందిగా నిర్వహించుకునే పరిస్థితులు144 సెక్షన్ వల్ల వస్తాయని, కరోనా రాకుండా మాస్కులు,భౌతిక దూరం,శానిటేషన్ పాటించేలా అధికారులు ఆంక్షలు విధించినా సహకరిస్తామని అన్నారు. పోలీసు, పురపాలన, రెవిన్యూ అధికారులు 144 సెక్షన్ విధించకుండా పునరాలోచించాలి అన్నారు.

కరోనా వచ్చిన తరువాత వైద్యం అందక నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేసారు. గుంటూరు జిల్లా ఎస్పీ, నరసరావుపేట డిఎస్పీ, చిలకలూరిపేట పట్టణ, రూరల్ సి ఐ లు 144 సెక్షన్ అమలు విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు.

విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న బాలిక కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు. బాలికను లైంగిక వేధింపులు చేసిన తెలుగుదేశం పార్టీ నేత వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలని రావుసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ బత్తుల అనిల్ పాల్గొన్నారు.

Related posts

సర్ధార్ సర్వాయి పాపన్న స్పూర్తితో రాజ్యాధికారాన్ని చేపట్టాలి

Satyam NEWS

తప్పుల తడకగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్

Bhavani

గెట్ రెడీ: లాక్ డౌన్ పొడిగిస్తే అందరం సహకరిద్దాం

Satyam NEWS

Leave a Comment