ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి యథాతధంగా ఉందని లతా మంగేష్కర్ బృందం ట్విట్టర్ ద్వారా తెలిపింది. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి కొద్ది మేరకు మెరుగుపడిందని వారు వెల్లడించారు. ఎలాంటి పుకార్లకు తావి ఇవ్వవద్దని, లతా దీదీ కోలుకుంటున్నారని వారు అభిమానులకు తెలిపారు. లతా మంగేష్కర్ ఆరోగ్యం కోసం అందరూ ఆ భగవంతుడిని ప్రార్థించాలని వారు కోరారు. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి గురించి ట్విట్టర్ లో తెలిపిన వారిలో అనుష, శ్రీనివాసన్ అయ్యర్, నారద్ ఉన్నారు.
previous post