38.2 C
Hyderabad
May 2, 2024 19: 58 PM
Slider మహబూబ్ నగర్

గర్భిణీ స్త్రీలకు రక్త హీనత సమస్య రాకుండా చూడాలి

#nagarkurnool

రక్త హీనతతో బాధపడుతున్న ప్రతి గర్భిణీ మహిళను ఆరోగ్యవంతులుగా మార్చేందుకు వైద్య ఆరోగ్య,  స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు.  సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య అధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు, సి.డి.పి.ఓ లు, ఐ.సి.డి.ఎస్. సూపర్వైజర్లతో  గర్భిణీ స్త్రీ ల రక్తహీనత, పి.హెచ్.సి సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాల నూతన భవనాలు, రిపేర్లు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 8 వేల మంది గర్భిణీ మహిళలు అంటే దాదాపు 70 శాతం గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు నివేదిక ఉందని వీరిని సామాన్య ఆరోగ్య స్థితికి తీసుకువచ్చేందుకు ఏ.ఎం.ఎం, ఆశా, అంగన్వాడీ టీచర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసారు. 

ఈ బృంద సభ్యులు తమ పరిధిలోని ప్రతి గర్భిణీ మశిళ ఇంటికీ వెళ్లి రక్తహీనత కు కారణం ఏంటి వారు సకాలంలో మొదటి ఏ.ఎన్. సి నమోదు చేసుకున్నారా, పి.హెచ్.సి లో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చరయించుకుంటున్నారా లేదా, ఐరన్ మాత్రలు, పౌష్టికాహారం తింటున్నారా అనేది పూర్తి వివరాలు సేకరించి వారికి తగిన అవగాహన కల్పించడం, వైద్య పరీక్షలు చేయించి సాధారణ ఆరోగ్య పరిస్థితి కి తీసుకువచ్చే విధంగా కృషి చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. 

రక్తహీనతతో బాధపడుతున్న వారి వివరాలు గ్రామపంచాయతీ వారిగా పేర్లతో సహా నివేదిక రూపొందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. జిల్లాలో  తక్కువ బరువు కలిగిన స్యామ్, మ్యామ్ తో బాధపడుతున్న   పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఇంకా  జిల్లాలో మరో  104 మంది పిల్లలు ఉన్నారని వీరిని సైతం సాధారణ ఆరోగ్య స్థితికి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. 

అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన మరుగుదొడ్లు, నూతన భవనాలు, అదనపు గదులు, రిపేర్లు మొదలగు ప ఉలను జాతీయ ఉపాధిహామీ  మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా పూర్తి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించినందున తమ పరిధిలోని కేంద్రాలకు కావ్సల్సిన రిపేర్లు తది తరములను గుర్తించి వాటికి పరిపాలన అనుమతులు తీసుకోవాల్సిందిగా సూచించారు. 

పరిపాలన అనుమతి అనంతరం ఎంపిడిఓ ల ద్వారా వర్క్ ఎస్టిమేషన్ చేయించి పనులు పూర్తి చేసుకొని ఏప్రిల్ 1వ తేదీ నాటికి పూర్తి బిల్లులు అందించే విధంగా చూడాలని ఆదేశించారు.  ముందుగా వచ్చిన వాటికి ముందుగా చెల్లింపులు అవుతాయి కాబట్టి త్వరితగతిన పనులను గుర్తించి పనులు పూర్తి చేసుకోవాల్సిందిగా తెలియచేశారు.

అంగన్వాడీల్లో న్యూట్రీ గార్డెన్లు సైతం జాతీయ ఉపాధి హామీ ద్వారా చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో   జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుధాకర్ లాల్, ప్రోగ్రాం ఆఫీసర్ డా. సాయినాథ్ రెడ్డి, ఇతర ప్రోగ్రాం ఆఫీసర్లు, సిడిపిఓ లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్

Related posts

భ‌ద్రాచ‌లం ఘ‌ట‌న‌.. ప్ర‌భుత్వోద్యోగుల‌కు నిజ్జంగా హ్యాట్సాఫ్‌!!!

Sub Editor

ఓ క‌లం వీరుడా ఇంకిపోవ‌డం త‌ప్ప ఒరిగిందేమీ లేదు

Satyam NEWS

జ‌గ‌న్‌ది ఫ్యాక్ష‌న్ క‌క్ష‌.. ధ‌ర్మ‌మే టిడిపికి ర‌క్ష‌

Bhavani

Leave a Comment