26.2 C
Hyderabad
July 23, 2024 19: 56 PM
Slider తెలంగాణ

లోకో పైలట్ చంద్రశేఖర్ కుడి కాలు తొలగింపు

loco pilet

లోకో పైలట్ చంద్ర శేఖర్ కుడికాలికి కేర్ హాస్పిటల్ వైద్యులు సర్జరీ చేశారు. కుడికాలుకు సర్జరీ చేసి మోకాలు పైభాగం వరకు తొలగించారు. కాగా సర్జరీ చేసే ముందు చంద్రశేఖర్ కుటుంబసభ్యులకు వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగా చంద్రశేఖర్ తండ్రి జోసఫ్ మీడియాతో మాట్లాడుతూ గురువారం ఉదయం తన కొడుకు చంద్రశేఖర్ కుడికాలుకు సర్జరీ చేసి మోకాలు పైభాగం వరకు తొలగించారన్నారు. కుడి కాలు పై భాగం వరకు స్పర్శ లేనందున, కుడి కాలు రక్త ప్రసరణ నిలిచి పోయిందన్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్స పట్ల తామంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి నెమ్మదిగా కుదుట పడుతుందని, పల్స్ రేటు శాతం కూడా మెరుగ్గానే ఉందని జోషఫ్ చెప్పారు. బ్లడ్ సెల్స్ కౌంట్ విషయంలోనూ పరిస్థితి మెరుగ్గా వుందన్నారు. తన కొడుకు స్పృహలోకి వచ్చాడని, అందరినీ గుర్తు పదుతున్నాడని అన్నారు. ఆరు వారాల తర్వాత మరొక సర్జరీ చేస్తామని వైద్యులు తెలిపారని, శరీర భాగంలో మల్టిపుల్ గాయాలయ్యాయని చెప్పారన్నారు. ఆరోగ్యం మెరుగైన తరువాత వైద్యులు ఆ ప్రాంతాల్లో సర్జరీ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.. తన కొడుకు బతకాలనీ ప్రార్థించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జోషఫ్ చెప్పారు.

Related posts

ఈతకు వెళ్లి నలుగురు యువకుల మృతి….

Satyam NEWS

ముథూట్ ఫైనాన్స్‌కు వ్యతిరేకంగా మళ్లీ సిఐటియు సమ్మె

Satyam NEWS

అక్షర బ్రహ్మకు అక్షరాంజలి

Satyam NEWS

Leave a Comment