27.7 C
Hyderabad
April 26, 2024 05: 43 AM
Slider ఆదిలాబాద్

ఈ వర్షాకాలంలో సన్నరకం వరి మాత్రమే పండించాలి

#Kagajnagar Crop Pattron

రైతులు వానాకాలంలో నాణ్యమైన సన్నరకాల వరిని పండించేలా చూడాలని కొమరంబీమ్ ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈ మేరకు ఆయన వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం నాడు ఆయన వ్యవసాయ అధికారులతో  వీడియో కాన్ఫరెన్సు  నిర్వహించి పలు సూచనలు సలహాలు  ఇచ్చారు.

సన్నరకాల వరితో బాటు అధిక దిగుబడిని ఇచ్చే పత్తిని  పండించాలని ఆయన సూచించారు. అదే విధంగా పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలని సందీప్ కుమార్ ఝా సూచించారు. గ్రామ గ్రామాన రైతు వేదిక లను నిర్మించుకొవాలని అన్నారు.

రైతులకు సంబంధించిన పంటలు  పాడి యాంత్రీకరణ   అంశాలన్నీ  రైతు  వేదికలో   రికార్డు చేయాలని  తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సు లో  వ్యవసాయ  అధికారి  శ్రీనివాస్ అన్ని  మండల  ఏ ఓ  లు పాల్గొన్నారు.

Related posts

ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Satyam NEWS

22వ రోజుకు చేరిన ముస్లిం మైనార్టీ సోదరుల నిరసనలు

Satyam NEWS

Analysis: దేశాన్ని కాపాడాల్సింది మేక్ ఇన్ ఇండియా నే

Satyam NEWS

Leave a Comment