38.2 C
Hyderabad
May 1, 2024 20: 33 PM
Slider ప్రత్యేకం

రోగి కళ్ళల్లో వెలుగులు నింపేలా డాక్టర్లు కృషిని కొనసాగించాలి

వైద్యం కోసం ఆస్పత్రులకు వచ్చే రోగుల జీవితాలలో వెలుగులు నింపేలా డాక్టర్లు రాజీలేని కృషిని కొనసాగించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. కాప్రా సర్కిల్ రాధిక చౌరస్తాలో మై ఆర్తో ఆస్పత్రిని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి లక్ష్మా రెడ్డి ల తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తూ అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను చూలగొనాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మై ఆర్తో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ విక్రమ్ గౌడ్ ను మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు.

ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ కార్మిక వాడలతో నిండుకున్న నియోజకవర్గంలో వందలాది వేలాది మంది వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మిక కుటుంబాలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాయని గుర్తు చేశారు.

కార్మిక కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ప్రైవేట్ ఆస్పత్రులు కీలక భూమికను పోషించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం బి సి మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, స్వర్ణ రాజ్, శాంతి సాయి జెన్ శేఖర్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, నాయకులు బిఏ రామచంద్ర గౌడ్, చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధి ఎంపల్లి పద్మా రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాసం మైపాల్ రెడ్డి, సుడుగుమహేందర్ రెడ్డి, డప్పు గిరిబాబు,నేమూరి మహేష్ గౌడ్, పెద్దాపురం కుమారస్వామి, శిరీష, గిరక బావి సురేఖ, ఏనుగు సీతారాం రెడ్డి, రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ ప్రజాగోస

Satyam NEWS

మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావద్దు

Satyam NEWS

(Natural) Best Natural Thing To Increase Male Enhancement Cancel Fxm Male Enhancement

Bhavani

Leave a Comment