40.2 C
Hyderabad
April 28, 2024 17: 31 PM
Slider నల్గొండ

ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వం అందించే రంజాన్ కానుకని హుజుర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిరుపేద ముస్లిం మైనారిటీ సోదరులకు అందజేశారు.

ఈ సందర్భంగా హుజుర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ
పర్వదినం అంటే శుభవేళ,ఉత్సవ సమయం అని అర్థమని,పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు,సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయని,పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుందని అన్నారు.

పండుగ మానావాళికి హితాన్ని బోధిస్తుందని, ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుందని, ముస్లిం సోదరులు చాంద్రమాన క్యాలండర్ ను అనుసరిస్తారని, చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’ మాసాన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారని అన్నారు.

దానికి ప్రధానమైన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే అని,క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతనల కలయికే ‘రంజాన్ మాసం ‘ అని తెలియజేస్తూ అన్ని వర్గాలలో పేద ప్రజలు ఉంటారని,ఆయా పేద ప్రజలు సంతోషంగా పండుగ చేసుకునేలాగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష అని, అందువలననే నిరుపేద పేద ముస్లిం వర్గాలకు రంజాన్ తోఫా అందిస్తున్నామని అన్నారు.ఇఫ్తార్ విందులో స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి స్వయంగా తన చేతులతో అందరికి ప్రేమతో వడ్డించారు.

ఈ కార్యక్రమములో మెళ్ళచెరువు, చింతలపాలెం,మఠంపల్లి మండలాల ముస్లిం మైనారిటీ నాయకులు,ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కేపీ హెచ్ బీ కాలనీ లో అత్యంత వైభవంగా సీతారాముల శోభ యాత్ర

Satyam NEWS

ఆసక్తికరంగా కలెక్టర్లతో సిఎం కేసీఆర్ ఫీల్డ్ విజిట్

Satyam NEWS

తూకంలో తరుగుపై ధాన్యం రైతుల గగ్గోలు

Satyam NEWS

Leave a Comment