35.2 C
Hyderabad
May 1, 2024 00: 10 AM
Slider నిజామాబాద్

ఎలుకలు, కుక్కలను పట్టుకోవడం వైద్యుల పనా?

#doctorsprotest

కామారెడ్డి జిల్లా ఆస్పత్రి వైద్యుల సస్పెన్షన్ పై వైద్యుల ఆగ్రహం

రోగులను చూసుకోకుండా ఎలుకలు, కుక్కలను పట్టుకోవడం వైద్యుల పనా అని కామారెడ్డి జిల్లా ఆస్పత్రి వైద్యులు ప్రశ్నించారు. జిల్లా ఆస్పత్రి ఐసియు విభాగంలో చికిత్స పొందుతున్న కోమా పేషంట్ ముజీబోద్దీన్ ను ఎలుకలు కరిచిన ఘటనకు బాద్యులను చేస్తూ అసోసియేట్ ప్రొఫెసర్ డా.వసంత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.కావ్యలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ జిల్లా ఆస్పత్రిలో టీటిజీడీఏ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. వైద్యులను సస్పెండ్ చేయడం ఉన్నతాధికారుల తొందరపాటు చర్యగా అభివర్ణించారు. డిఎంఈ, హెల్త్ సెక్రటరీ వెంటనే సస్పెన్షన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టీచింగ్ విషయంలో తప్పు చేస్తే, ఇబ్బందులు జరిగితే వైద్యులపై చర్యలుండాలి తప్ప సానిటేషన్ ఏజన్సీ చేసిన తప్పులకు వైద్యులను బలిచేయడం సరికాదన్నారు. ఈరోజు వైద్యుల సస్పెన్షన్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టిటిజీడీఏ ఆధ్వర్యంలో అన్ని మెడికల కలశాలలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతున్నామన్నారు. సాయంత్రం లోగా సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రేపు చలో డిఎంఈ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

సమస్య తీవ్రస్థాయికి వెల్లకముందే అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు. 10 మంది వైద్యులు ఉండాల్సిన చోట ఐదుగురు మాత్రమే ఉన్నారని, అందులో ఇద్దరిని సస్పెండ్ చేస్తే ముగ్గురితో ఆస్పత్రి నిర్వహణ ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ను సస్పెండ్ చేస్తే డిపార్టుమెంట్ ఎలా ముందుకు వెళ్తుందని నిలదీశారు. ఇకనుంచి తమ మెడలో ఉన్న స్టెతస్కొప్ పక్కన పెడతామని, తమకు సానిటేషన్ పనులు, ఎలుకలు, కుక్కలు, పందులను పట్టడం నేర్పించాలని, టీచింగ్ పనులను సానిటేషన్ వారికి అప్పగించాలని ఎద్దేవా చేశారు. ఎలుకలు, కుక్కలను చూసుకోవడానికి వైద్యులు ఉంటే కోట్లాది రూపాయలు ఇచ్చి సానిటేషన్ ఏజన్సీలను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆస్పత్రిలో ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఏర్పాటు చేయకుండా వైద్యులను బలి చేయడం సరికాదన్నారు. ఇకనైనా అధికారులు పునరాలోచించి వెంటనే వైద్యులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

నర్సుల ఆందోళన

జిల్లా ఆస్పత్రిలో వైద్యుల నిరసన అనంతరం స్టాఫ్ నర్సులు కూడా ఆందోళన చేపట్టారు. ఐసీయూలో పని చేస్తున్న స్టాఫ్ నర్స్ మంజులను సస్పెండ్ చేయడం పట్ల నర్సులు నిరసన తెలియజేశారు. వెంటనే స్టాఫ్ నర్సును విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

ఆస్పత్రి సూపరిండెంట్ గా డా. రాంసింగ్

కోమా పేషంట్ ను ఎలుక కరిచిన ఘటనలో ప్రభుత్వ చర్యలు ఆఘమేఘాల మీద జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఇద్దరు వైద్యులు ఒక స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసిన అధికారులు జిల్లా ఆస్పత్రి ఇంచార్జి సూపరిండెంట్ ను కూడా నియమించారు. ఇప్పటివరకు సూపరిండెంట్ గా కొనసాగిన డా.విజయలక్ష్మిని కలెక్టర్ కు సరెండర్ చేయడంతో ఇంచార్జి సూపరిండెంట్ గా మెడికల్ కళాశాల  ప్రొఫెసర్ డా. రాంసింగ్ ను నియమిస్తూ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. డా. రాంసింగ్ కు ఉత్తర్వుల కాపీని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇప్పటివరకు సూపరిండెంట్ గా సేవలందించిన డా. విజయలక్ష్మిని శాలువాతో సత్కరించారు. ఇంచార్జి సూపరిండెంట్ గా డా.రాంసింగ్ బాధ్యతలు చేపట్టగా పలువురు వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ఎన్ డి ఏ కూటమి నుంచి కూడా శివసేన అవుట్

Satyam NEWS

తప్పుడు ఆరోపణ చేసిన వారు బహిరంగ చర్చకు సిద్ధమేనా?

Satyam NEWS

బి అవేర్:కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

Leave a Comment