36.2 C
Hyderabad
April 27, 2024 21: 44 PM
Slider ఖమ్మం

120 కోట్లతో 2వేల ఇళ్ళు

#ministerpuvvada

డబల్ బెడ్ రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం మంత్రి నగరంలోని టేకులపల్లి కేసీఆర్ టవర్స్ డబల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులు 263 మందికి ఇళ్ల పట్టాలను స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మొదటి విడత సుమారు ఒక వేయి మంది లబ్దిదారులకు పట్టాలు ఆందజేసినట్లు, రెండో విడత మంజూరు లబ్దిదారులకు ప్రస్తుతం పట్టాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

11 ఎకరాల్లో 1250 ఇండ్లు ఒకేచోట ఒక గేటెడ్ కమ్యూనిటిగా రూపుదిద్దుకున్నాయన్నారు. ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు వెచ్చించినట్లు, విద్యుత్, అంతర్గత రోడ్లు, త్రాగునీరు, డ్రెయిన్స్ అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రంఖమ్మం నియోజకవర్గంలో రూ. 120 కోట్ల ఖర్చుతో 2 వేలకు పైగా డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు చేసినట్లు ఆయన అన్నారు. వైఎస్ఆర్ నగర్, మల్లెమడుగు, అల్లిపూర్ లలో ఇంకో 400 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు.

ఇండ్ల నిర్మాణ సమయంలో 40 కి పైగా సార్లు పనుల పురోగతిపై తనిఖీలు చేసినట్లు, రోడ్లకు రూ. 4 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన అన్నారు. డబల్ బెడ్ రూం లబ్దిదారుడి స్వంతమని, వారి ఆస్తిని వారు కాపాడుకోవాలని, ఇది కోల్పోతే మళ్ళీ జన్మలో రాదని, దీనిని దుర్వినియోగం చేయొద్దని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఏఎంసి చైర్ పర్సన్ దోరెపల్లి శ్వేత, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గుడ్ న్యూస్:రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ

Satyam NEWS

గురువు

Satyam NEWS

ఫిబ్రవరి 23న విష్ణుసహస్రనామ పారాయణం

Satyam NEWS

Leave a Comment