29.7 C
Hyderabad
May 3, 2024 04: 54 AM
Slider మెదక్

అత్యంత పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు చేయాలి

#HarishRao

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గం పరిధిలో నిర్మాణం పూర్తైన రెండు పడక గదుల ఇండ్ల ను సాధ్యమైనంత త్వరగా లబ్దిదారుల కు అందించాలనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారుల ను ఆదేశించారు.

అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా రెండు పడక గదుల ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని మంత్రి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

దుబ్బాక నియోజవర్గస్థాయిలో రెండు పడక గదుల ఇండ్ల పురోగతి , కేటాయింపు, ఉపాధి హామీ పథకం, ఇతర అభివృద్ధి పనుల ప్రగతి పై జిల్లా అధికారులు, ఇంజనీరింగ్, విద్యుత్, మిషన్ భగీరథ , రెవెన్యూ, జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ అధికారులతో MPDO మీటింగ్ హాలులో మంత్రి తన్నీరు హరీష్ రావు సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.

 సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ పద్మాకర్ , దుబ్బాక మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ లు, జెడ్పీటీసీ లు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక నియోజక వర్గ పరిధిలోని అన్ని మండలాల లు, గ్రామాల వారీగా రెండు పడక గదుల ఇండ్ల పురోగతి పై సమీక్షించారు.

గ్రామం వారీగా ప్రారంభోత్సవానికి లక్ష్యాలను నిర్దేశించారు. ఇప్పటికీ ఇండ్లు మంజూరు అయి పనులు ప్రారంభం కానీ చోట వెంటనే పనులను ప్రారంభించాలని సూచించారు. దుబ్బాక వర్గ నియోజక వర్గంలో కరెంట్ సమస్యకు లేకుండా చూడాలని, లో ఓల్టేజ్ సమస్యలు ఉందొద్దని మంత్రి విద్యుత్ అధికారులను ఆదేశించారు.

కొత్తగా లేదా అదనంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ల నిర్మాణం అవసరమైతే వెంటనే చేపట్టాలని అందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. రైతు వేదికలు కు విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు.

దుబ్బాక నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో వైకుంఠ ధామాలు, డంప్ యార్డుల నిర్మాణం సెప్టెంబర్ నెలా ఖరులోగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ అధికారుల ను మంత్రి అదేశించారు. త్వరితగతిన నిర్మాణాల పూర్తికి డెడ్ లైన్ పెట్టుకుని పని చేయాలన్నారు.

చేగుంట లో వైకుంఠ ధామాలు, డంప్ యార్డులు లక్ష్యం వంద శాతం పూర్తి చేసినందుకు చేగుంట ఎంపీడీవో ను మంత్రి అభినందించారు. ప్రతి గ్రామంకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం కార్యక్రమాలు చేపట్టేందుకు NHRM క్రింద సుమారు 12 వేల రూపాయలు ANM కు వచ్చాయన్నారు.

వెంటనే ఎంపీడీవో లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తో సమన్వయం చేసుకొని సంబంధిత నిధులతో శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలన్నారు.

దుబ్బాక నియోజకవర్గం లో మొత్తం 1214 చెరువులు, చెక్ డ్యాం లకు గానూ 1000కి పైగా చెరువులు నిండాయన్నారు. నిండిన చెరువుల్లో వచ్చే 15 రోజుల్లోగా చేపలు వద లాలని మంత్రి మత్య శాఖ అధికారులను ఆదేశించారు.

Related posts

మోదీ కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలే: మల్లు రవి

Satyam NEWS

ఇండస్ట్రీయల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఖాయిలా పరిశ్రమలకు ఊతం

Satyam NEWS

అల్లరి మూకలు : రైలు పట్టాలపై బాంబులు

Satyam NEWS

Leave a Comment