పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ రీజియన్‌లోని హృదయాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో క్రూడ్ బాంబులు కలకలం రేపాయి. బుధవారం మధ్యాహ్నం స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై నాలుగు క్రూడ్ బాంబులను రైల్వే పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. భారత్ బంద్ ఉద్ధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ బాంబులు దొరకడం కలకలం రేపుతోంది. ఆందోళనలో ఎవరైనా అల్లరి మూకలు చేరి ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
previous post