31.7 C
Hyderabad
May 2, 2024 09: 40 AM
Slider తూర్పుగోదావరి

గంజాయి సమాచారానికి డబల్ ధమాకా బహుమతులు

#Dr. BR Ambedkar Konaseema

గంజాయి రవాణా, అమ్మే వారి(పెడ్లర్స్)సమాచారం పోలీసులకు అందిస్తే 50 వేల రూపాయలు గంజాయి వినియోగించే వారి సమాచారం అందిస్తే 10 వేల రూపాయలు బహుమతిగా ఇస్తామని కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.గురువారం మధ్యాహ్నం గంజాయి మరియు ఇతర డ్రగ్స్ నియంత్రణలో మెరుగైన సమన్వయం కోసం జిల్లా స్థాయి కమిటీ (ఎన్ సి ఓ ఆర్ డి సమావేశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ లతా మాధురి ట్రైనీ ఐపీఎస్ పంకజ్ మీనా, డిఆర్ఓ సత్తిబాబు, ఆర్డిఓ అమలాపురం వసంత రాయుడు , వివిధ శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.మొదటగా కమిటీ మెంబర్ కన్వీనర్ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఎన్ డి పి ఎస్ చట్టం గురించి కమిటీ సభ్యులకు విశదీకరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇతర డ్రగ్స్ తో పోలిస్తే గంజాయి ప్రభావం కాస్త ఎక్కువగా ఉందని, విద్యార్థులు మరియు కొంతమంది రోజు కూలి పని చేసేవారు గంజాయి అలవాటు పడుతున్నారని వారిని గుర్తించడం లో పోలీసువారికి అన్ని శాఖల వారు సహకరించాలని కోరారు. గంజాయి వాడకం నియంత్రణలో పోలీసులు తాత్కాలికంగా నివారించగలరని జిల్లాలోని ప్రజలు, అన్ని ప్రభుత్వ శాఖలు సహకరిస్తే పూర్తిగా గంజాయి వాడకాన్ని జిల్లాలో నియంత్రించవచ్చన్నారు.

సచివాలయ పరిధిలో,స్కూల్స్ కాలేజీలు, హాస్పిటల్స్ లో డి అడిక్షన్ కేంద్రాల కు వచ్చే గంజాయి తాగే వారిని గుర్తించి పోలీసు కు సమాచారం అందిస్తే ఈ వినియోగదారుల ద్వారా గంజాయి అమ్మే వారిని ( పెడ్డ్లర్స్), రవాణా చేసే వారిని గుర్తించి వారిని అరెస్టు చేసి తద్వారా గంజాయి వాడకాన్ని పూర్తిగా నివారించవచ్చని సంబంధిత అధికారులను కోరారు.

వ్యవసాయ అధికారులు వ్యవసాయ క్షేత్రాల పరిశీలనకు వెళ్ళినప్పుడు వ్యవసాయ క్షేత్రాలలో ఎవరైనా గంజాయి సాగు చేస్తున్న వారి సమాచారం , సోషల్ వెల్ఫేర్ వసతి గృహాలలో ఉండే విద్యార్థులు తల్లిదండ్రులకు దూరంగా ఉంటారని వారిలో ఎవరైనా గంజాయి తీసుకుంటున్నట్టు తెలిస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. కొన్నిచోట్ల ఆర్టీసీ బస్సులలో గంజాయి రవాణా జరుగుతుందని దీనిపై ఆర్టీసీ సిబ్బంది దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

గంజాయి రవాణా చేసిన సరఫరా చేసిన వినియోగించిన కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు.రాబోయే మూడు నాలుగు నెలల్లో గంజాయి జిల్లాలో సరఫరా అవ్వకుండా నియంత్రిస్తే గంజాయిని వినియోగించేవారు బయటకు వస్తారని తద్వారా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డి అడిక్షన్ కేంద్రాలలో చేర్చి వారిని గంజాయి వాడకం నుంచి విముక్తుల్ని చేయొచ్చని తెలిపారు.


అనంతరం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ గతంలో గంజాయి తాగడం సామాజిక దురాచారం గా భావించే వారిని కానీ ఇప్పుడు అది అనేక కారణాలవల్ల సోషల్ స్టేటస్ గా మారిందని, కొంతమంది యువత సినిమాలు చూసి అలవాటుగా మార్చుకుంటున్నారని సినిమాలకైతే సెన్సార్ ఉందని కానీ ప్రస్తుతం ఓటీపీల మీద సెన్సార్ లేదని త్వరలోనే ఓటీపీ మీద కూడా ప్రభుత్వం సెన్సార్ చట్టాలు తెస్తుందని తెలిపారు.

గతంలో రేవు పార్టీలు అంటే గోవా వంటి ప్రదేశాలు గుర్తొచ్చేవని కానీ ఇప్పుడు గ్రామాలకు కూడా సంస్కృతి పాకిందని దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరికట్టాలని దానికి జిల్లా అధికారులు సహకరించాలని కోరారు.

పిల్లలను తండ్రులతో పోలిస్తే తల్లులు ఎక్కువ గా పర్యవేక్షిస్తుంటారని కావున జిల్లాలోని డిఆర్డిఏ మరియు మెప్మా పరిధిలోని మహిళా సంఘాల సమావేశాలలో గంజాయి తాగేవారిని గుర్తించడం, గజాయి తాగడం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు.

జిల్లాలో అమలాపురంలోని ఏరియా హాస్పిటల్ లో ఒక డి అడిక్షన్ కేంద్రం ఉందని నియోజకవర్గానికి ఒక డి అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని డి యం హెచ్ ఓ ని ఆదేశించారు.

మెడికల్ షాపుల్లో కూడా డేకాయ్ ఆపరేషన్లు నిర్వహించి ఇతర డ్రగ్స్ వాడకాన్ని నివారించాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. జిల్లాలో పోలీసులకి గంజాయి రవాణా, అమ్మే వారి(పెడ్లర్స్) సమాచారం అందించిన వారికి 50 వేల రూపాయలు గంజాయి వినియోగదారుల సమాచారమిచ్చిన వారికి 10 వేల రూపాయలు బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

గంజాయి రవాణా, సరఫరా చేసేవారి, వినియోగదారుల సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని , ఎవరికైనా సమాచారం తెలిస్తే 8712692102 ఫోన్ నెంబర్ కు కాల్ చేసి కానీ వాట్సాప్ ద్వారా గాని సమాచారం అందించొచ్చని తెలిపారు.

Related posts

బాబాయి మర్డర్: సీబీఐ అదుపులో ఎర్రం గంగిరెడ్డి

Satyam NEWS

తొణికిన స్వప్నం

Satyam NEWS

ఒక్క స్నాప్  తో ఘ‌ట‌నా స్థ‌లికి పోలీసులు….!ఎక్క‌డంటే…?

Satyam NEWS

Leave a Comment