38.2 C
Hyderabad
April 29, 2024 14: 00 PM
Slider చిత్తూరు

PVKN డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా డా. జీవనజ్యోతి

#PVKN Degree College

కళాశాల అభివృద్ధికి అధ్యాపకులు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చిత్తూరు PVKN ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపాల్ డాక్టర్ పి. జీవన్ జ్యోతి కోరారు. నూతన ప్రిన్సిపాల్ గా శుక్రవారం ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ నాక్ ప్రమాణాలకు అనుగుణంగా విద్యా బోధన జరగాలన్నారు.

ప్రభుత్వానికి నివేదికలు ఎప్పటికప్పుడు జాప్యం లేకుండా పంపాలన్నారు. స్వయం ఉపాధి కోర్సులను ప్రోత్సాహించాలని కోరారు. కళాశాల అభివృద్ధిలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. కళాశాలలోకి ప్రవేశించగానే NCC క్యాడెట్లు గౌరవ వందనం సమర్పించారు. అధ్యాపకులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

ఎంఎస్సీ., బీఈడీ., ఎం ఫీల్., పిహెచ్డి. చేసిన డా. పి. జీవన జ్యోతి 1973 జులై 16న జన్మించారు. బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత అయిన జీవన జ్యోతి నేషనల్ హాకీ ప్లేయర్ కూడా. ప్రాథమిక విద్యను తిరుపతి కేంద్రీయ విద్యాలయంలో, డిగ్రీ విద్య శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో అభ్యసించారు. పిహెచ్డి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చేశారు.

1996 నవంబరు ఏడున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుర్రంకొండ లో స్కూల్ అసిస్టెంట్ గా అధ్యాపక జీవితాన్ని ఆరంభించారు. 2010 మార్చి 10న పదోన్నతి పై జూనియర్ కెమిస్ట్రీ లెక్చరర్ గా కలికిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారు. 2006 ఆగస్టు 16న పదోన్నతి మీద పీలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ లెక్చరర్ గా చేరారు.

పుత్తూరు, నగిరిలో లెక్చరర్ గా పనిచేసి, ప్రిన్సిపాల్ గా పదోన్నతి పై మన్యం జిల్లా, సీతం పేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకటిన్నర సంవత్సరము సమర్థవంతంగా పనిచేశారు. ప్రస్తుతం బదిలీపైన చిత్తూరు పి వి కే ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. వృత్తినే దైవంగా భావిస్తూ నిరంతరము విద్యార్థి లోకం అభివృద్ధికి కృషి చేస్తున్న డాక్టర్ పి జీవన్ జ్యోతికి భగవంతుడు అన్నివేళలా ఆశీస్సులు అందించాలని పెద్దలు ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో తండ్రి పత్రి విశ్వనాధం, తల్లి వింధ్యవతమ్మ, డాక్టర్ పి జీవన్ జ్యోతి గారి భర్త చిక్కా అశోక్, పెద్ద కుమారుడు చిక్కా శివరాజ్, కోడలు పత్రి అర్చన, చిన్న కుమారుడు చిక్కా సాయి తేజ, సోదరుడు పి సుధాకర్ పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగం సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాటి గంగాధర్, జిల్లా అధ్యక్షుడు సంకు బలయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

జస్టిస్: సమత రేప్ కేసులో ముగ్గురికి ఉరి

Satyam NEWS

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తారా లేదా?

Satyam NEWS

కొత్త నోట్లు కట్టలు కట్టలు దొరుకుతున్నాయి

Satyam NEWS

Leave a Comment