29.7 C
Hyderabad
May 2, 2024 06: 00 AM
Slider మహబూబ్ నగర్

అంబేద్కర్ కు నివాళులు అర్పించిన దళితులు

ambdkar kollapur

దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్  వర్ధంతిని కొల్లాపూర్ ఇందిరా కాలనీ దళిత ప్రజలు ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, భారతరత్న, బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఇందిరా కాలనీలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ముఖ్య అతిధిగా  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు  రాము యాదవ్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి  స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రచించిన  రాజ్యాంగం ఎంతో పవిత్రమైందన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు అంబేద్కర్ కు రుణపడి ఉండాలన్నారు.

అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని ఆయన అన్నారు. అంబేద్కర్ ఆశయాల కోసం  ప్రతి ఒక్కరు  కృషి చేయాలన్నారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతిలను జరుపుకోవడమే కాదు ఆయన ఆశయాలను నెరవేర్చాలని రాము యాదవ్ అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ప్రజల ముందుకు వెళ్లాలని అన్ని రంగాలలో రాణించాలన్నారు.

 అంతకు ముందు సంపాంగి నరసింహ్మ, ఔట బాలస్వామి, బి.కన్నయ్య, డాక్టర్ కోళ్ల చిట్టి బాబు, జర్నలిస్ట్ ఔట రాజశేఖర్, మోజర్ల గోపాల్, పి.స్వామి, బిజ్జ అర్జున్, బిజ్జ రమేష్, మద్దిలేటి కాంగ్రెస్ నాయకులు అది వసంత కుమార్, సిరాజ్, శీలం వెంకటేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో శివ, క్రాంతి, శివ, సాయి, బాలరాజు, వెంకట్ చలం కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

(Natural) Hiwtoharvestcbd Hemp

Bhavani

ఖమ్మం పోలీసు కమిషనర్ కార్యాలయంలో ప్రజాదివాస్

Satyam NEWS

గాల్వాన్ హీరోలకు ప్రధాని మోడీ పరామర్శ

Satyam NEWS

Leave a Comment