38.2 C
Hyderabad
May 1, 2024 21: 23 PM
Slider ఖమ్మం

ప్రజా వైద్యులుగా జిల్లాపై చెరగని ముద్ర వేసిన డాక్టర్ వై ఆర్ కె

#medicalcamp

ప్రజా వైద్యులుగా ఖమ్మం జిల్లాపై చెరగని ముద్ర వేసిన  రాజ్యసభ మాజీ సభ్యులు ప్రముఖ ప్రజా వైద్యులు డాక్టర్ ఎలమంచిలి రాధాకృష్ణమూర్తి ఆదర్శ వంతమైన జీవితాన్ని గడిపి ఆదర్శంగా నిలిచారని  సి‌పి‌ఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు , భద్రాద్రి బాంక్  ఛైర్మన్ కృష్ణమూర్తి అన్నారు.  డాక్టర్ ఎలమంచిలి రాధాకృష్ణమూర్తి 94వ జయంతి సందర్భంగా నగరంలోని ప్రముఖ వైద్యులచే ఉచిత మెగా వైద్య శిబిరం ఖమ్మం నగరం లోని  స్థానిక పత్తి మార్కెట్లో నిర్వహించడం జరిగింది.

         ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ వై ఆర్ కే  తన జీవితాంతం ఆదర్శవంతమైన జీవితాన్ని ఆచరించి నేటి యువతకు స్పూర్తి ప్రదాతగా నిలిచారని పేర్కొన్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లా పై ప్రజా వైద్యులుగా డాక్టర్ వై ఆర్ కె చెరగని ముద్ర వేశారన్నారు. సామాజిక రుగ్మతలకు కూడా రాజ్యసభ సభ్యులుగా, అనేక ప్రజా పోరాటాల ద్వారా సరైన పరిష్కారాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లారన్నారు. డాక్టర్ వై ఆర్ కె వారసత్వాన్ని వారి కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డౌలే లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ పేదలకి డాక్టర్ వై ఆర్ కె నెల నెలా వైద్య శిబిరం ఈ ప్రాంతంలో అందిస్తున్న సేవలు చిరాస్మరణీయమని ప్రసంశించారు.  ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎర్ర శ్రీకాంత్, వైద్యులు డాక్టర్ వై రామకోటేశ్వరరావు, డాక్టర్ వై రవీందర్ నాథ్, డాక్టర్ వై రమాదేవి, డాక్టర్ వై నాగమణి, డాక్టర్ చీకటి భారవి, డాక్టర్ ఆలెనే ప్రవీణ్ కుమార్, డాక్టర్ జడల రణధీర్, డాక్టర్ పరుచూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ కొల్లి అనుదీప్, డాక్టర్ గుడిపూడి రాజేష్, డాక్టర్ రావెళ్ళ రంజిత్, డాక్టర్ యం. నాగేశ్వరరావు, డాక్టర్ పగడాల దేవి వరప్రసాద్, డాక్టర్ పిల్లలమర్రి సుబ్బారావు, డాక్టర్ కే యూ భాస్కర్, డాక్టర్ పి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాలి

Satyam NEWS

అర్చకులకు తీపికబురు: గౌర‌వ వేతనం రూ. 10 వేల‌కు పెంపు

Bhavani

గుంక‌లాం ఇళ్ల పట్టాల కార్య‌క్ర‌మానికి అడ్డంకులు రాకుండా చూడండి

Satyam NEWS

Leave a Comment