34.2 C
Hyderabad
May 10, 2024 13: 40 PM
Slider కరీంనగర్

టెక్నాలజీ: మందు బాబులను పసిగట్టే డ్రోన్ కెమెరా

drone cams

ఈ పోలీసులకు ఈ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు కానీ బహిరంగ ప్రదేశాల్లో మందు కొట్టే వారికి ఇది శాపంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లో మందు కొట్టే వారిపై ఇటీవల పోలీసులు కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కరీంనగర్ రూరల్, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఇలాంటి మందుబాబుల్ని పట్టుకునేందుకు డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు.

డ్రోన్ కెమెరాల ప్రయోగం సక్సెస్ అయింది. ఆరెపల్లి, రేకుర్తి శివారులోని బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న ఏడుగురు మందు బాబులను పోలీసులు రెడ్ హాండెడ్ గా పట్టేశారు. పోలీసులు థాంక్స్ టు డ్రోన్ కెమెరా అంటుంటే డ్రోన్ కెమెరా డౌన్ డౌన్ అంటున్నారు మందు బాబులు.

పోలీసులు పట్టుకున్న వారిలో కరీంనగర్ కు చెందిన సంతోష్, శివనాథ్, ఆర్ వినయ్,ఆర్ కిరణ్,పి తిరుపతి, హుస్నాబాద్ కు చెందిన జి సాగర్, కొడిమ్యాల కు చెందిన వెంకటేశులు ఉన్నారు. ఇక పోలీసులంతా బహిరంగ ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాలు వినియోగిస్తే బెటరేమో?

Related posts

అమృత్ ఉద్యాన్ గా మొఘల్ గార్డెన్స్

Murali Krishna

మానసిక దివ్యాంగునికి మానవతతో వీల్ చైర్ అందజేత

Satyam NEWS

బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు

Murali Krishna

Leave a Comment