28.7 C
Hyderabad
April 28, 2024 03: 17 AM
Slider ఆధ్యాత్మికం

వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు కాదు రెండు రోజులే

swarupanandendra

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభావాలతో చెడుగుడు ఆడుకుంటున్నది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని ముందుగా ప్రకటించారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ముందుగా చెప్పారు.

దీనికి ఆగమ శాస్త్ర పండితులు కూడా ఓకే అన్నారని ప్రకటించారు. అయితే తొలుత అనుకున్నట్టు 10 రోజులు ఉండదని టిటిడి బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులు మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు.

తిరుమలకు వచ్చిన విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానంద సరస్వతిని టీటీడీ ఛైర్మన్, ఆలయ ప్రధాన అర్చకుడు కలిశారు. అనంతరం మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఉత్సవమూర్తుల విగ్రహాల అరుగుదల అంశాన్ని స్వామీజీ దృష్టికి అర్చకులు తీసుకొచ్చారని, చారిత్రక ఆలయాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని స్వామీజీ చెప్పారని తెలిపారు. ఈ నెల 21 వరకు స్వరూపానంద సరస్వతి తిరుమలలోనే బస చేయనున్నారు.

Related posts

5000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

Satyam NEWS

నాలుగేళ్ల తర్వాత ఉప్పల్‌ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్‌

Bhavani

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

Satyam NEWS

Leave a Comment