27.7 C
Hyderabad
April 30, 2024 10: 05 AM
Slider జాతీయం

అన్నమ్మా, మా కొంప ముంచావు కదమ్మా

annamma

అన్నమ్మ అంటే ఇదేదో మంచి పేరు ఈ మనిషి కూడా మంచిదని అనుకోవద్దు సుమా. ఈ అన్నమ్మ మూడున్నర కోట్లకు మోసం చేయడమే కాకుండా 66 మంది మలయాళీలను అమ్మేసింది. నకిలీ వీసాలు ఇప్పిస్తూ మనీలాండరింగ్ కు పాల్పడే భారీ రాకెట్టు తో ఈ అన్నమ్మకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

కెనడాకు అధీకృత రిక్రూట్‌మెంట్ ఏజెంట్‌గా చెప్పుకొని అన్నమ్మ చాలా మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. కెనడా నుంచి నేరుగా వీసా రాదని అందువల్ల ఖతార్ నుంచి వెళ్లిపోవచ్చునని వారికి చెప్పి మధ్యలోనే మోసం చేసి 66 కుటుంబాలను రోడ్డనపడేసింది ఈ అన్నమ్మ.

ఇలా చెప్పి మహిళలతో సహా 66 మంది మలయాళీలను కెనడాకు పంపింది. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత వారికి తెలిసింది ఏమిటంటే అవన్నీ నకిలీ వీసాలు. ఇడుక్కి, కన్నూర్, పాల, అంగమాలి, చాలకూడిలోని వివిధ ప్రాంతాల ప్రజలు అన్నమ్మ చేతిలో మోసపోయారు. ఒక్కొక్కరి నుంచి  రూ .5 లక్షల నుండి రూ.15 లక్షల రూపాయల వరకూ అన్నమ్మ వసూలు చేసింది. ఇవన్నీ బాధిత కుటుంబాలకు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు యథా ప్రకారం కేసు దర్యాప్తులో ఉంది అంటూ వాయిదాలపై వాయిదాలు వేశారు. ఈ లోపు ఈ అన్నమ్మ జార్జి ముందస్తు బెయిల్ పిటీషన్లను ఫైల్ చేసింది. అయితే అన్నమ్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వివిధ కోర్టులు తిరస్కరించడంతో ఆమె తన బృందంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

అన్ని ఆధారాలు ఇచ్చినా కూడా పోలీసులు సకాలంలో అరెస్టు చేయకపోవడంవల్లే అన్నమ్మ అజ్ఞాతంలోకి వెళ్లిందని బాధితులు అంటున్నారు. అన్నమ్మతో పోలీసులు కుమ్మక్కయ్యారని కూడా మరి కొందరు ఆరోపిస్తున్నారు. అన్నమ్మ కోసం వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు.

Related posts

ఎర్రబల్లె చెరువు పరిశీల‌న

Sub Editor

ఇంద్రవెల్లి అమరులకు నివాళి అర్పించిన రేవంత్ రెడ్డి

Satyam NEWS

అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన

Satyam NEWS

Leave a Comment