29.7 C
Hyderabad
May 1, 2024 05: 44 AM
Slider విజయనగరం

డ్రంక్ అండ్ డ్రైవ్ పై విజయనగరం పోలీసులు అలెర్ట్…….!

మద్యం తాగి బండి న‌డ‌ప‌డం నేరం..మ‌ద్యం సేవించి బైక్ డ్రైవ్ చేయ‌డం త‌ప్పు. విశాఖ‌,హైద‌రాబాద్, తిరుప‌తి లాంటి మ‌హాన‌గ‌రాల‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వ‌హించ‌డం పోలీస్ శాఖ రోజువారి విదుల‌లో ప్ర‌ధాన‌మైన‌ది కూడాను వైన్ షాపుల‌లో తాగ‌డం ……అలాగే బార్ లు రెస్టారెంట్లు…డాబాలు.ఇండ్ల వ‌ద్ద మ‌ద్యం సేవించ‌డం…ష‌రా మామూలే.

కానీ…డ్రైవ్ చేస్తున్న‌…అదే బైక్ ,కారు వంటివి న‌డుపుతూ…. తాగినా…లేక మ‌ద్యం సేవించి వాటిని న‌డిపినా…చ‌ట్ట రీత్యా నేరం.. అందుకు శిక్ష‌లు కూడా కోర్టు లు విధిస్తున్నాయి. అయితే కొన్ని సంద‌ర్బంగా… ముందుగానే ప‌రీక్ష‌లు చేస్తున్నారు…పోలీసులు. అందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మిష‌న్ ల‌తో…రాత్రి ఎనిమిది త‌ర్వాత రోడ్ల‌పై బైక్ ల పై తిరుగుతున్న వాళ్ల‌కు ప‌రీక్ష‌లు చేసి..ఈ చ‌లానాలు విదిస్తున్నారు…పోలీసులు.

అందులో భాగంగానే ఏపీలోని విజ‌య‌న‌గ‌రలో అటు ట్రాఫిక్ పోలీసుల‌తో పాటు లా అండ్ ఆర్డ‌ర్ సిబ్బంది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్విహిస్తోంది.తాజాగా నైట్ డ్యూటీలో టూటౌన్ ఎస్ఐ… త‌న విధుల‌లో్ భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల‌ను ప‌ట్టుకున్నారు.

అదీ న‌గ‌రంలోని పూల్ భాగ్ వ‌ద్ద‌…అర్ధ‌రాత్రి ఒంటి గంట ప్రాంతంలో కొంద మంది కుర్రాళ్లు మ‌ద్యం సేవించ‌డాన్ని గుర్తించిన స‌ద‌రు ఎస్ఐ వాళ్ల పేర్ల‌ను తీసుకుని కొంత‌మందికి త‌న దైన స్టైల్ లో ఓ ఝ‌ల‌క్ ఇచ్చారు.అక్క‌డితో ఆగ‌కుండా… మ‌ద్యం సేవించిన వారిని దుర్భాష‌లాడ‌టం..ఒకానొక సంద‌ర్బంగా చేయి చేసుకునేంత వ‌ర‌కు వెళ్ల‌డంతో స‌ద‌రు వ్య‌క్తి హాస్ప‌ట‌ల్ పాల‌య్యాడు.

అర్ధ‌రాత్రి జ‌రిగిన విష‌యం..దావాలనంలా సోష‌ల్ మీడియా పుణ్య‌మా పైకి పొక్క‌డం..అక్క‌డ నుంచీ ప‌త్రికల‌కు తెలిసింది. దీంతో స‌ద‌రు ఎస్ఐ త‌న ఖాకీ జులుం చూపించారంటూ… హాస్పటల్ లో జాయ‌న్ అయినా… అవుట్ పోష్టు సిబ్బంది కేసు నమోదు చెయ్యకుండా కాలయాపన చేస్తున్నారంటూ బాధిత స్నేహితులు ఆరోపిస్తున్నారు.

ఇదే విష‌యంపై అటు ఇంచార్జ్ డీఎస్పీని…అలాగే స్టేష‌న్ ఎస్ఐ ని స‌త్యం న్యూస్.నెట్ ప్ర‌తినిధి వివ‌ర‌ణ అడిగింది. న‌డి రోడ్ పై అదీ అర్ధ‌రాత్రి మ‌ద్యం సేవించ‌డం నేర‌మ‌ని అది అడిగినందుకు… కొట్టార‌ని అన‌టంలో వాస్త‌వం లేద‌ని చెప్పారు. ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ …పుణ్య‌మా… విజ‌య‌న‌గ‌ర పోలీసు ప‌ని త‌నం ఎలాంటితో తెలిసిందని అంటోంది…స‌త్యం న్యూస్.నెట్.

Related posts

ప్రజా సమస్యల పరిష్కరమే నా ధ్యేయం

Satyam NEWS

ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదని స్టూడెంట్స్ ఆత్మహత్య

Bhavani

అన్యాయం చేసే ఆర్డినెన్స్‌ 2ను రద్దు చేయాలి

Satyam NEWS

Leave a Comment