37.2 C
Hyderabad
April 26, 2024 21: 21 PM
Slider ప్రత్యేకం

జెండా స్వామి పండుగలో పాల్గొన్న కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

#uttam

సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో జెండా స్వామి పండుగలో నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రేపు నాగార్జునసాగర్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సన్నాహక సభకు తాను కూడా  వెళ్తున్నానని అన్నారు.2023 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా రాబోతుందని,వరంగల్ లో జరిగే రాహుల్ గాంధీ సభ నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త స్వచ్ఛందంగా వచ్చి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి  వాళ్ల మోసపూరిత వాక్యాలు, అసమర్థతతో రైతులను మోసం చేస్తున్నారని,రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ రైతులు అప్పుల నుంచి  ఆదుకోవడానికి,పంటలకు మంచి ధర  ఇవ్వడానికి,రైతుల ప్రకృతి వైపు నడపడానికి,మంచి పథకాలు తేవడానికి రాహుల్ గాంధీ వరంగల్ సభలో మాట్లాడతారని అన్నారు.తెలంగాణ  రైతులకు వారి జీవితములో వెలుగులు నింపటానికి రాహుల్ గాంధీ కొన్ని ప్రకటనలు చేయనున్నారని,తెలంగాణలో రైతుల పెట్టుబడి పెట్టి నష్టపోయినా మోడీకి,కెసిఆర్ కు మాత్రం చలనం లేదని అన్నారు.

రైతుల నుంచి ధాన్యం కొనకుండా అధికార పార్టీ ధర్నా చేయడం చేతగాని అసమర్థత ప్రభుత్వం కెసిఆర్ దని,

తెలంగాణలో రైతు ఋణ మాఫీ పూర్తిగా విఫలమైందని,గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో ఒకేసారి ఋణ మాఫీ చేసిందని గుర్తు చేశారు.

2023 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు ఋణమాఫీ  ఏకకాలంలో  చేస్తామని,తెలంగాణలో కౌలు రైతులకు బ్యాంకు ఋణాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని,వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కౌలు రైతులను ఆదుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి,మంజూ నాయక్, సీతారామయ్య, భీముడు, ఆదూరి కిషన్ రెడ్డి, త్రిపురం వెంకట నర్సిరెడ్డి,లక్ష్మీ, సైదులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బదిలీ అయిన ఉపాధ్యాయులకు వీడ్కోలు సన్మానం

Satyam NEWS

లోక్ సభ ఎన్నికలకు బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ ల నియామకం

Satyam NEWS

Atrocious: కరోనా పేషంట్లకు ఇక్కడ స్మశానమే దిక్కు

Satyam NEWS

Leave a Comment