31.2 C
Hyderabad
May 3, 2024 00: 57 AM
Slider ఆదిలాబాద్

దోచుకో నా రాజా: నకిలీ పత్తి విత్తనాల వెల్లువ

#Duplicare Cotton Seeds

సిర్పూర్ నియోజకవర్గం లో దళారులు రైతులను దారుణంగా మోసం చేస్తున్నారు. అసలు ఏదో నకిలీ ఏదో గుర్తు పట్టకుండా పత్తి విత్తనాలను తయారు చేస్తున్నారు. bt3 అనే పత్తి విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఈ విత్తనాలను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో నిషేధించింది.

పర్యావరణానికి హాని జరుగుతుందని, భూసారం దెబ్బతింటుందని, రైతులకు దీని వల్ల  నష్టాలు ఏర్పడతాయని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. కానీ అక్రమార్కులు బి టి  3 పత్తి విత్తనాలు రైతులకు మేలు చేస్తాయని పంట ఎక్కువ వస్తుందని కలుపు మందులు పిచికారి చేసుకోవచ్చు ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అంటూ మోసపూరిత మాటలు చెప్పి రైతులకు అంటగడుతున్నారు.

అసలు కంపెనీ ప్యాకెట్ల కంటే అందం గా నకిలీవి తయారు చేస్తున్నారు. వీటి ముద్రణ ప్యాకింగ్ వ్యవస్థ చూస్తే మామూలు వ్యక్తులు ఎవరు గుర్తు పట్టలేరు. ఇందులో ఎంత పెద్ద తలకాయలు ఉన్నాయో అధికారుల రాజకీయ అండదండలు ఉన్నాయో ఊహించుకోవచ్చు.

సిర్పూర్ నియోజకవర్గం మహారాష్ట్ర బార్డర్ కు ఉండడంవల్ల అక్కడ ప్రభుత్వం గ్లైపోసైడ్ గడ్డి మందును నిషేదించ కపోవడం తెలంగాణకు రవాణా విచ్చలవిడిగా చేస్తున్నారు. దీన్ని వ్యాపారులు రేట్లు పెంచి రైతులకు అంటగడుతున్నారు. ఈ వ్యాపారం వందల కోట్లలో ఉన్నదంటే నమ్మాలి.

ఈరోజు పెంచికల్పేట్ మండలంలోని ఆగుర్గూడ సమీపంలో ఎస్సై చెంచు రమేష్ పట్టుకున్న పత్తి ప్యాకెట్లను చూస్తే అసలు నకిలీ గుర్తుపట్టలేని విధంగా ఉంది. అదేవిధంగా ఈరోజుసిర్పూర్ (టి) మండలంలో 60 లీటర్ల నిషేధిత గ్లైపోసైడ్ గడ్డి మందు పట్టుకున్నారు. పలువురి పై కేసు నమోదు చేసినట్లు  ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. అధికారులు పట్టుకుంటేనే ఈ మొత్తంలో దొరుకుతుంది అంటే దొరకకుండా ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయో?

Related posts

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా టీకా ఉచితం

Satyam NEWS

త్రినాథ్ పెదిరెడ్ల ఇక లేరు

Satyam NEWS

Leave a Comment