42.2 C
Hyderabad
April 26, 2024 17: 23 PM
Slider నల్గొండ

ప్రజల పై కరెంటు పెట్రోల్ డీజిల్ ధరల భారం వద్దు

CMP Hujurnagar

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండగా కరెంటు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రభుత్వాలు ప్రజలపై మరింత భారం వేశాయని సీ.పి.యం జిల్లా నాయకులు జిట్ట నగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు చిట్యాల మండల కేంద్రంలో సి.పీ.యం ఆధ్వర్యంలో కనకదుర్గ సెంటర్ లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్లే కార్డ్ లతో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ కరోనా కాలంలో కరెంటు చార్జీలు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా ఆరు నెలల పాటు అవసరమగు  నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ఆదుకోవాలని కోరారు. ఉపాది హామీ పథకం పనులు పట్టణ ప్రాంత పేదలకు కల్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, నాయకులు పామనుగుల్ల అచ్చాలు,నారబోయ్న శ్రీనివాసులు, కత్తుల లింగస్వామి, శీలా రాజయ్య, ఐతరాజు నర్సింహ, రుద్రారపు పెద్దలు, జిట్ట సరోజ, బొడ్డు బాబురావు, రాములు తదితరులు పాల్గొన్నారు

Related posts

కేంద్ర సమాచార శాఖ పరిధిలోకి ఆన్ లైన్ కంటెంటు

Satyam NEWS

తొలి బ్యాచ్ ఆర్టీసీ శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్లు

Satyam NEWS

నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా నా వారిని కాపాడుకొంటా…

Satyam NEWS

Leave a Comment