37.2 C
Hyderabad
May 2, 2024 12: 29 PM
Slider ముఖ్యంశాలు

తొమ్మిదేండ్ల పాలనలో కేంద్రం అన్ని రంగాల్లో విఫలం

#BRS Lok Sabha

తొమ్మిదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్​ఎస్​ లోక్​సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు విమర్శించారు. మోడీ సర్కారుపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా బీఆర్​ఎస్​ తరపున ఆయన సభలో మాట్లాడారు. తొలుత అవిశ్వాస తీర్మానానికి మద్ధతు తెలుపుతున్నట్టు వెల్లడించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైందని, దేశంలో చిన్న, పెద్ద రాష్ట్రాలు వున్నాయని అన్నారు. అయితే, కేంద్రం కొన్ని రాష్ట్రాలకే సహకారం అందజేస్తుందని… చాలా రాష్ట్రాలకు ఏమాత్రం సహకారం ఇవ్వడం లేదన్నారు. కేంద్రం ప్రతి ఒక్క రాష్ట్రాన్ని సమ దృష్టితో చూడాలన్నారు. రాష్ట్రాల భద్రత కేంద్రం బాధ్యత అని గుర్తు చేశారు. గత తొమ్మిది సంవత్సరాల్లో సీఎం కేసీఆర్​ సారథ్యంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి చెందిందన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తారని, ఇదే సభలో ప్రవేశపెట్టి అమలు చేసిన విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. విభజన హామీలలో భాగంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి అంటే అక్కడ వ్యాగన్ రిపేర్ యూనిట్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కోచ్​ ఫ్యాక్టర్ గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలకు తరలించారని అన్నారు. ఐఐఎం ఇవ్వలేదని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి, ఆ హామీ ఇంతవరకు అమలు చేయలేదన్నారు.

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని, కానీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటని అన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర విషయం ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని నిలదీశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క జిల్లాకు ఒక్కొక్క నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలనీ గత 9 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్​ తో పాటు తాను కూడా పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశానని వివరించారు.

లోక్ సభలో పలుమార్లు ఈ విషయమై మాట్లాడినట్టు గుర్తు చేశారు. అయినా, చట్ట ప్రకారం ప్రతి ఒక్క జిల్లాకు నవోదయ విద్యాలయాలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని విమర్శించారు. ఐ.టి.ఐ.ఆర్ తెలంగాణ రాష్ట్రానికి మంజూరు అయితే దానిని రద్దు చేసి వేరొక్క రాష్ట్రానికి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం కక్ష్య పూరితంగా వ్యవహరించడం సరికాదు అన్నారు.

తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నా కొన్ని పధకాలను కేంద్రం కాపీ కొట్టి అమలు చేస్తుందని నామ నాగేశ్వరరావు అన్నారు. దేశంలోనే మొదటిసారిగా సీఎం కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం లోని రైతులకు రైతుబంధు ద్వారా ఎకరాకు పది వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నారని ఈ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఎకరానికి 6 వేలు ఇస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పుట్టిన రైతు బిడ్డగా చిన్నప్పటి నుండి తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు వరకు తాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. ఎండాకాలం వచ్చింది అంటే మార్చి నుండి జులై వరకు మంచి నీటి కోసం కష్టాలు వర్ణనాతీతం ఉండేదన్నారు. కేసీఆర్​ సీఎం అయ్యాక తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పధకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగు నీరు అందిస్తున్నామన్నారు.

ఇదే పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని…హర్ ఘర్ జల్ పేరుతో ప్రవేశ పెట్టారన్నారు. ఇదే లోక్ సభలో పెద్ద రాష్ట్రాల్లో ఇంటింటికి తాగు నీరు అందిస్తున్న రాష్ట్రం ఏది అని ప్రశ్నిస్తే సంబంధిత మంత్రే సమాధానం ఇస్తూ ఇంటింటికి త్రాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రము తెలంగాణ అని తెలిపారన్నారు. ఈ మిషన్ భగీరథ పధకానికి 24,000 కోట్లు నిధులు ఇవ్వాలి అని నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నేటికీ నిధులు ఇవ్వలేదు అన్నారు. దేశం లో ప్రతి రాష్ట్రానికి హర్ ఘర్ జల్ పధకానికి నిధులు ఇస్తూ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం నిధులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.

దేశంలో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రము తెలంగాణ అన్నారు. ఇదే విధంగా కేంద్రం కూడా ప్రతి రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ పధకాన్ని అమలు చేయాలి అన్నారు. అమెరికా లో అయినా పవర్ కట్ అవుతుంది ఏమో కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏ ఒక్క రోజు కరెంటు కోతలు వుండవన్నారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడక ముందు రాష్ట్రము అంధకారంలో ఉందని తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత 18,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసాము అని తద్వారా విద్యుత్ కొరత లేకుండా అయ్యింది అన్నారు.

వరి ఉత్పత్తిలో దేశం లో నెం.1 వరి ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రాన్ని కూడా వెనుకకు నెట్టి వేసి తెలంగాణ రాష్ట్రం దేశం లో నెం.1 గా ఉందని, తెలంగాణ రాష్ట్రం రాక మునుపు రెండు లక్షలు వున్నా ఎకరం ఇప్పడు ముప్పై లక్షలు అయ్యిందన్నారు. పర్ క్యాపిటా ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని కేంద్ర ప్రభుత్వ మద్ధతు లేకపోయినా సరే మేము నెంబర్ 1 కి చేరుకోగలిగం అని తెలిపారు.

కేంద్రం ప్రభుత్వం అనేక అంశాల్లో విఫలమైందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు బీజేపీ ప్రభుత్వ హాయంలో బాగా పెరిగాయిని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అన్నారు. బీజేపీ ప్రభుత్వ హాయం లో దేశంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయిందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అని ఈ తొమ్మది సం”లో 18 కోట్ల ఉద్యాగాలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదన్నారు. తాము ఎన్డీఏ కాదు.. ఇండియా కూటమి కూడా కాదని మాది భారత రాష్ట్ర సమితి అని మేము దేశ ప్రజలతో ఉన్నాము అన్నారు.

మణిపూర్ విషయంలో ప్రపంచంలో భారత్ తలదించుకోవాల్సి వస్తోందని సుప్రీంకోర్టు కూడా ముగ్గురు మాజీ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. 15వ లోక్‌సభ సమయంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కాశ్మీర్‌లో జరిగిన హింసపై అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సుష్మ స్వరాజ్‌తో పాటు తాము డిమాండ్ చేశామని అదే రీతిలో ఇప్పుడు మణిపూర్‌కు అఖిలపక్ష బృందాన్ని కేంద్రం తీసుకెళ్లాలి అని డిమాండ్ చేసారు. కేంద్రం అన్ని రంగాల్లో విఫలం అయ్యిందని అందుకే కేంద్రం పైన అవిశ్వాస తీర్మానానికి ఈ సందర్భంగా మద్దతు తెలుపుతున్నాము ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు.

Related posts

ఎన్నికలకు సిద్ధం: మహానాడు లో చంద్రబాబు వెల్లడి

Satyam NEWS

తుమ్మల ఇంటికి పొంగులేటి

Bhavani

పాతపట్నం మండలంలో నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment