27.7 C
Hyderabad
April 30, 2024 09: 31 AM
Slider వరంగల్

ఈ ఫైలింగ్ లో స్కాన్ చేసి e ఆఫీస్ లో రికార్డులు భద్రపరచాలి

#mulugucollector

రెవెన్యూ రికార్డులు, ఇతర ముఖ్యమైన రికార్డులను ఈ ఫైలింగ్ ద్వారా స్కాన్ చేసి e ఆఫీస్ లో భద్రపరచాలని ములుగు జిల్లా ఎస్.కృష్ణ ఆదిత్య ఆదేశించారు. e ఆఫీస్ లో భద్రపరచడం వలన సమాచార సేకరణ సౌలభ్యంగా ఉంటుందని ఆయన అన్నారు.

జిల్లా కలెక్టరేట్ లోని  వివిధ చాంబర్స్ ని నేడు ఆయన తనిఖీ చేశారు. అనంతరం మండల తాహసిల్దర్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డ్ రూం ను తనిఖీ లో భాగంగా రెవెన్యూ రికార్డ్స్ e ఫైలింగ్ లో స్కాన్ చేసిన  ప్రతి ఫైల్ జాగ్రత్తగా భద్రపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

రికార్డ్స్ అన్నీ సెక్షన్స్ వారీగా సూచిక తయారు చేసి ఫైల్ భద్రత తో పాటు అవసరం నిమిత్తం లభ్యమయ్యే విధంగా సులభతరంగా ఉండేలా రికార్డ్ రూం చాల నీట్ గా ఉంచాలని కలెక్టర్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్మాణం లో ఉన్న ఇవియం గోదాం ను కూడా ఆయన పర్యవేక్షించారు.

గోదాం నిర్మాణం  పూర్తి దశకు చేకుందని, త్వరగా ప్రారంభానికి తుది మెరుగులు దిద్దావలసిన పని త్వరగా పూర్తి చేయించాలని కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి శ్యామ్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో  ములుగు తహసిల్దార్ సత్యనారాయణ స్వామి, డిఏఓo శ్రీనివాస్ రావు, EDM దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

శాంతియుత వాతావరణంలో బక్రీద్ వేడుకలు జరుపుకోవాలి

Satyam NEWS

పౌరసత్వ చట్టంపై జగన్ ది రెండు నాల్కల ధోరణి

Satyam NEWS

స్నేహితులతో గడపాలని భార్యను వేధిస్తున్న భర్త

Satyam NEWS

Leave a Comment