31.7 C
Hyderabad
May 2, 2024 10: 07 AM
Slider జాతీయం

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌

మహారాష్ట్ర మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ దూకుడు పెంచింది. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌ అయ్యారు. ముంబయి కార్యాలయంలో 12 గంటలపైనే విచారించిన అనంతరం ఈడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండ్‌ అయిన పోలీసు అధికారి సచిన్‌ వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలు గతంలో సంచలనం అయ్యాయి. దీంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది.

Related posts

పంచ‌భూతాల వ‌ల్ల‌నే మాన‌వ మ‌నుగ‌డ‌

Satyam NEWS

వివాదాస్పద నేత గోపాల్‌ కందా మద్దతు తీసుకోం

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీలో లో కోదండరాం టీజేఎస్ విలీనం?

Satyam NEWS

Leave a Comment