Slider నల్గొండ

తెలంగాణ లో విద్య క్యాలెండర్ విడుదల చేయాలి

#AISFNalgonda

తెలంగాణలో  లో విద్య క్యాలెండర్ ను  విడుదల చేయాలని  భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యూఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా అధ్యక్షులు వంగూరి వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా గురువారం  ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో విద్య సంవత్సరం క్యాలెండర్ ప్రకటించకుండా ఆన్ లైన్  పాఠాలు చెప్పుతామంటూ ప్రభుత్వం ప్రకటించడం వల్ల ఇప్పటికి ప్రవేట్ కార్పొరేట్ విద్య సంస్థలు ఆన్ లైన్ చదువుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజులతో పిడిస్తున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్య విధానాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఫయాజ్ నాగరాజు షోయబ్ సుభాని జహంగీర్ తౌసిఫ్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

Bhavani

ఫిలిం ఇండస్ట్రీ: తెలివైన పాలకుడు చేయాల్సిన పని ఇది

Satyam NEWS

అకాల వర్షంతో అల్లాడిన హైదరాబాద్: తల్లడిల్లిన రైతన్న

Satyam NEWS

Leave a Comment