26.7 C
Hyderabad
April 27, 2024 08: 07 AM
శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా విద్యా శాఖ అధికారిణి కి కృతజ్ఞతలు

srikakulam

సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగస్థులకు రెండు నెలల జీతాలు విడుదల చేసినందుకు శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష, జిల్లా విద్యాశాఖ అధికారిణి చంద్రకళ కు సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగస్థుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, గంగు వెంకటరమణ, గుండ బాల మోహన్ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.

తమకు తమ శాఖలో అనేక విభాగాల్లో సుమారుగా 2,500 మంది పైగా పరుగు సేవల్లో పనిచేస్తున్నారని కానీ మూడు నుంచి నాలుగు నెలల వరకు జీతాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురయ్యామని వారు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష, జిల్లా విద్యాశాఖ అధికారిణి చంద్రకళ ప్రత్యేక చొరవ తీసుకుని తమకు జీతాలు విడుదల చేయించారని వారు తెలిపారు. అదేవిధంగా ఈనెల నవంబర్ ఉద్యోగస్తుల డ్యూటీ చార్ట్, తొందరగా నవంబర్ నెలాఖరు లోపు జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయానికి  నేరుగా అంద చేయవలసిందిగా కోరారు.

వచ్చే నెల డిసెంబర్ లో శ్రీకాకుళం జిల్లా ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం మీటింగ్ శ్రీకాకుళం పట్టణంలో జరుగుతుందని, త్వరలోనే మీటింగ్ తేదీని ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

Related posts

మార్చి26న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయండి

Satyam NEWS

పారిశుద్ధ్య కార్మికులు సమ్మె నోటీస్

Sub Editor

బిజెపి నేషనల్ కౌన్సిల్ సభ్యునిగా చల్లా వెంకటేశ్వర రావు

Satyam NEWS

Leave a Comment