25.2 C
Hyderabad
May 8, 2024 11: 01 AM
Slider శ్రీకాకుళం

పారిశుద్ధ్య కార్మికులు సమ్మె నోటీస్

Sanitation workers

స్థానిక పంచాయతీలకు ముడి పెట్టకుండా ప్రభుత్వమే కార్మికులను రెగ్యులరైజ్ చేసి జీతం 21,000 ఇవ్వాలని టెండర్ విధానం రద్దు చేసి, హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్లతో దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా నవంబర్ 26వ తేదీన గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్తున్నట్లు ఈవో మోహన్ బాబుకి సమ్మె నోటీస్ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా కార్యదర్శి వై.చలపతిరావు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సంఘం అధ్యక్షులు బెవర. రాము మాట్లాడుతూ పంచాయతీల ఆదాయం బట్టి కార్మికుల జీతాలు చెల్లించడం వల్ల సకాలంలో జీతాలు ఇవ్వకుండా పెండింగ్ లో ఉంటున్నాయని కార్మికుల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వమే నేరుగా జీతాలు 21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

2015లో హైకోర్టు తీర్పు ప్రకారం టెండర్ తో సంబంధం లేకుండా కార్మికుల ఉద్యోగాలలో కొనసాగించాలి టెండర్ పేరుతో అక్రమ వసూళ్లు నిలుపు వేయాలి అని తెలిపారు. జీవో నెంబర్ 132, 57లను తక్షణమే అమలు చేయాల‌ని, ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలి గ్రామీణ ప్రాంతంలో చెత్త పన్ను వంటి యూజర్ చార్జీలు వేసి ప్రజలపై భారం వెయ్యడం సరికాద‌న్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి అధిక ధరలు అరికట్టాలి. దళితులు, మహిళలు, మైనార్టీలు పై దాడులు నివారించాలి కార్మిక చట్టాలను యాజమాన్యానికి అనుకూలంగా మార్చే కార్మిక కోడ్ ను రద్దు చేయాలి. పంచాయతీ కార్మికుల హరిత రాయబారలకు పెండింగ్లో ఉన్న 3 నుండి 36 నెలల జీతాలను వెంటనే చెల్లించాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల రాము, గణేష్, బోగేష్, వీరేష్ రాజారావు కాజేష్, అప్పన్న, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు

Related posts

పేదల్ని చంపుతున్న ఆకలి బాధలు తెలియని ఎమ్మెల్యేలు

Satyam NEWS

దేవరకొండ ఖిల్లా పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి కృషి

Satyam NEWS

బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సిఎం సాయం

Satyam NEWS

Leave a Comment