38.2 C
Hyderabad
April 29, 2024 11: 07 AM
Slider ప్రత్యేకం

థాంక్స్ టు ఒంటి కొమ్ము ఖడ్గమృగం సూప్

thanks to rihno

శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ ఎం ఎల్ ఏ లు ఎంత కట్టుబాటు ప్రదర్శించారు. తాము నమ్ముకున్న సిద్ధాంతం కోసం అమ్ముడు పోకుండా తాము గెలిచిన పార్టీలోనే ఉండి బిజెపి అధికారంలోకి రాకుండా చేశారు. ఎంత గ్రేట్. దేశంలోని చాలా రాష్ట్రాలలో గెలిచిన పార్టీ ని వదిలేసి అధికార పార్టీలోకి జెంప్ చేస్తున్న ఎం ఎల్ ఏలకు మహారాష్ట్రలో ఎం ఎల్ ఏలకు ఎంత తేడా. అందరూ మహారాష్ట్ర ఎం ఎల్ ఏలను చూసి నైతిక విలువలు నేర్చుకోవాలనుకుటున్నారా?

అలా అనుకుంటున్న పక్షంలో మీరు తప్పులో కాలేసినట్టే. మహారాష్ట్రలో శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ ఎంఎల్ఏలను కట్టిపడేసింది సిద్ధాంతాలు కాదు. ఒంటి కొమ్ము ఖడ్గమృగం సూప్. నిజం. ఇది నిజంగా నిజం. ఎంతో ఖరీదైన ఒంటి కొమ్ము ఖడ్గమృగం సూప్ తాగితే శారీరక దారుఢ్యం పెరుగుతుంది. దాని వల్ల లేటు వయసులో కూడా కుర్ర చేష్టలు చేసుకోవచ్చు. ఇది చాలా కాలంగా చైనాలో మందు రూపంలో వాడేవారు…. సంబంధిత రోగుల కోసం.

అయితే 1993 లో ఒంటి కొమ్ము ఖడ్గమృగం కొమ్మును వైద్యంలో వాడే అంశంపై చైనా కూడా నిషేధం విధించింది. అరుదైన ఒంటి కొమ్ము ఖడ్గమృగం అంతరిస్తున్న ఈ దశలో దాని కొమ్మును ఇలా వినియోగించడం వల్ల మరింత నష్టం జరుగుతుందని చైనా భావించింది.

అప్పటి నుంచి వారు మానేశారు కానీ చాలా దేశాలలోని స్టార్ హోటళ్లలో అత్యంత ఖరీదుకు (దాని ధర మనం ఊహించేంత తక్కువగా ఉండదు) సరఫరా చేస్తుంటారట. ముంబయిలోని ఐదు నక్షత్రాల హోటల్ లో దీన్ని ఈ మూడు పార్టీల ఎం ఎల్ ఏలకు సూప్ రూపంలో సరఫరా చేశారు. ఒక రోజు తాగారో ఎన్నికల ఫలితాల నుంచి తాగుతూనే ఉన్నారో తెలియదు కానీ ఒక్కో ఎం ఎల్ ఏ కు 14 కోట్ల రూపాయల బిల్లు అయింది. టెర్రెస్ గార్డెన్ లో మందు, విందు లతో బాటు ఒంటి కొమ్ము ఖడ్గమృగం సూప్ ప్రత్యేకం. ఇక ఈ ఎంఎల్ఏలు బిజెపి వైపు ఎందుకు వెళతారు? ఇదీ శివసేన, ఎన్ సిపి, కాంగ్రెస్ ల విజయ రహస్యం.

Related posts

కాంగ్రెస్ ప్రభంజనానికి తర్వాత వేదిక తెలంగాణ

Satyam NEWS

కష్టపడితేనే ఉన్నత స్థానాలకు చేరుకోగలం

Satyam NEWS

కోర్టు ధిక్కరణ కేసుపై సుప్రీంకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment