31.7 C
Hyderabad
May 7, 2024 00: 28 AM
Slider వరంగల్

చదువుకు పేదరికం అడ్డుకాకూడదు: సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

#taslima

చదువుకు పేదరికం అడుకాకుడదని,చదువే అన్నిటికీ మార్గం చూపిస్తుందని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన ఓరుగంటి ప్రిన్స్ అనే విద్యార్థిని జవహర్ నగర్ మాడల్ పాఠశాలలో తస్లీమా చేర్పించారు.

బుధవారం పాఠశాలకు తస్లీమా తానే స్వయంగా వెళ్ళి ప్రిన్స్ పాల్ తో మాట్లాడి విద్యార్థికి అడ్మిషన్ ఇప్పించారు. తస్లీమా మాట్లాడుతూ చదువుకు ఎలాంటి భేదాలు ఉండవని, చదువే ప్రతి సమస్యకూ పరిష్కారం చూపుతుందని ఆమె అన్నారు. చదువుతోనే పేదరికం దూరమవుతుందని తస్లీమా అన్నారు. అడగగానే విద్యార్థి అడ్మిషన్ కు సహకరించిన ప్రిన్స్ పాల్ కుమార్ ను తస్లీమా అభినందించారు.

Related posts

మా అబ్బాయికి నా బస్సులే కనిపిస్తున్నాయి

Satyam NEWS

ట్రాజెడీ: ముద్దులొలికే ఈ పాప ఇక లేదు

Satyam NEWS

PBDAV మోడల్ స్కూల్ నూతన విద్యార్థి మండలి వేడుక

Satyam NEWS

Leave a Comment