39.2 C
Hyderabad
April 28, 2024 12: 42 PM
Slider హైదరాబాద్

PBDAV మోడల్ స్కూల్ నూతన విద్యార్థి మండలి వేడుక

#davschool

సికింద్రాబాద్ లోని ఓల్డ్ సఫిల్ గూడ లో ఉన్న పి. బి. డి. ఏ.వి మోడల్ స్కూల్ నూతన విద్యార్ధి మండలి పరిచయ  ప్రమాణ స్వీకారోత్సవం ఇటీవల అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NTPC డిప్యూటీ జనరల్ మేనేజర్, రిటైర్డ్  & వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ సీనియర్ ఫ్యాకల్టీ T.R. గణేష్ ను విద్యార్థినీ విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ తో , స్కూల్ ప్రిన్సిపాల్ M. ప్రభాకర్ , స్కూల్ కోఆర్డినేటర్ లక్ష్మి శ్రీనివాసన్ సాదరంగా ఆహ్వానించారు.

సైన్స్ విభాగాధిపతి రంగనాయకి ముఖ్య అతిథిని సభికులకు పరిచయం చేయగా, జయశ్రీ రంగరాజన్ కార్యక్రమ వక్తగా వ్యవహరించారు.

C C A విభాగం ఉపాధ్యాయినులు రుక్సానా, రేమా సురేష్ కార్యక్రమ నిర్వహణలో తోడ్పడ్డారు.

స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ అధ్యక్షతన, ముఖ్య అతిధి గణేష్ కొత్తగా ఎన్నికైన విద్యార్థి మండలి నాయకులకు బాడ్జిలు అందించి అభినందిచారు. నూతన విద్యార్థి మండలి అధ్యక్షుడిగా  అక్షయ్ శర్మ, నాయకురాలిగా అఖిల, క్రీడల విభాగం కెప్టెన్ గా మొహమ్మద్ ఇస్తియాక్ అలీఖాన్, వైస్ కెప్టెన్ గా ఆదిత్య, సాంస్కృతిక విభాగం కార్యదర్శి గా లలిత దీక్షిత, ఉప కార్యదర్శి గా జ్యోత్స్న లను పరిచయం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిధి ఉపన్యాసం అక్కడ ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయినులల్లో ఎంతో ప్రేరణతో పాటు, నూతన ఉత్తేజాన్ని నింపింది. వారు మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా విని పట్టుదలతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. విద్యార్థులు కష్టపడటంతో పాటు ఇష్టపడి చదివినప్పుడే వారు అనుకున్న లక్ష్యాలను అధిగమిస్తారని హితవు పలికారు.

విద్యార్థినీ, విద్యార్థులు తమదైన శైలిలో ఆట పాటలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. చివరగా స్కూల్ కోఆర్డినేటర్ లక్ష్మి శ్రీనివాసన్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

Related posts

బివేర్: కళ్లనూ మోసం చేసే కరోనా వీడియోలు

Satyam NEWS

సక్సెస్:విజయవంతంగా నింగిలోకి సోలార్‌ ఆర్బిటర్‌

Satyam NEWS

పిచ్చి ముదిరింది: స్వాతంత్య్ర యోధుల పేరు కూడా హాంఫట్

Satyam NEWS

Leave a Comment